Sunday, March 22, 2026 01:18 PM
Sunday, March 22, 2026 01:18 PM

వీణ రాగాలకు మాయమైన మద్దతు..!

ఈ మధ్యకాలంలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఏ స్థాయిలో రాజకీయాలను కుదిపేసిందో మనం చూస్తూనే ఉన్నాం. ఓ మహిళతో అక్రమ సంబంధం, బయటకొచ్చిన వీడియోలు, ఆ మహిళ మీడియా ముందు మాట్లాడిన మాటలు అన్నీ కూడా సంచలనమే. రాజకీయంగా ప్రస్తుతం బలంగా కనబడుతున్న జనసేన పార్టీకి ఎమ్మెల్యే వైఖరి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఆ అమ్మాయి 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం, అరవ శ్రీధర్ ఇచ్చేందుకు నిరాకరించడం వంటివి.. ఇక తనకు ఆరుసార్లు అబార్షన్ అయిందంటూ ఆమె చెప్పుకునే ప్రయత్నం, వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.

Also Read : కామన్ మ్యాన్ కిరణ్ కేనా..? అంబటికి ట్రీట్మెంట్ ఉంటుందా..?

అయితే ఉన్నఫలంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అదృశ్యమయ్యారు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని కుటుంబ సభ్యులతో మాత్రమే టచ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై జనసేన పార్టీ కూడా కొంత సీరియస్ అయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన వీణ.. అరవ శ్రీధర్ తనను వాడుకుని వదిలేసాడని, అత్యాచారాలకు పాల్పడ్డాడని ఆమె మాట్లాడింది. అయితే మీడియా సమావేశంలో తన ఫోన్ చూపించే సమయంలో చాటింగ్లో ఉన్న కొన్ని మెసేజ్లను డిలీట్ చేసే విషయంలో మర్చిపోయింది ఆ మహిళ. ఇక అక్కడి నుంచి కూటమి పార్టీల కార్యకర్తలు ఇది వైసీపీ డ్రామా అని, ఆమెతో వైసీపీ నేతలు మాట్లాడిస్తున్నారంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : చంద్రబాబు ఫిట్నెస్ కు ఫిదా.. వైరల్ అవుతోన్న వీడియో

అప్పటివరకు వైసీపీ అనుకూల మీడియాకు అందుబాటులో ఉన్న ఆమె ఆ తర్వాత నుంచి కనపడకుండా పోయింది. ఇక ఎమ్మెల్యే తల్లి ప్రమీల కూడా ఆమెపై కేసు నమోదు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. సాధారణంగా ఇటువంటి వ్యవహారాల్లో మగాళ్లదే తప్పు అని భావన సమాజంలో ఎక్కువగా ఉంటుంది. కానీ క్రమంగా ఈ వ్యవహారంలో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే క్లారిటీకి ప్రజలు వచ్చారు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం బయటపడటానికి ప్రధాన కారణం ఆరవ శ్రీధర్ 25 కోట్లు ఇవ్వకపోవడమే అనే క్లారిటీకి కూడా ప్రజలు వచ్చేసారు. అయితే ఇప్పుడు వీణ కు వైసీపీ సోషల్ మీడియా మద్దతు ఇవ్వడం లేదు. ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వైసిపి కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. ఇద్దరి మధ్య వ్యవహారం కారణంగానే ఆమె రోడ్డు మీదకు వచ్చిందని వైసిపి కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్న పరిస్థితి. ఇక వైసిపి అనుకూల మీడియా కూడా సైలెంట్ గా సైడ్ అయిపోవడంతో.. ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్