Wednesday, August 5, 2026 11:08 AM
Wednesday, August 5, 2026 11:08 AM

చంద్రబాబు ఫిట్నెస్ కు ఫిదా.. వైరల్ అవుతోన్న వీడియో

ఫిట్నెస్ విషయంలో, ఆరోగ్యం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. ఆహారం విషయం తో పాటుగా క్రమశిక్షణ విషయంలో కూడా చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎప్పుడూ మీడియాలో కనపడుతూ ఉండే చంద్రబాబు తాజాగా ఓ కార్యక్రమంలో చూపించిన హుషారు చూసి టిడిపి నేతలతో పాటుగా ఆయనను విమర్శించే వారు కూడా షాక్ అయ్యారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడుతుంటే.. చంద్రబాబు మాత్రం 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా కదలడం ఆశ్చర్యం కలిగించింది.

Also Read : గతం మర్చిపోయిన జగన్..!

తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పం మండలం.. శివపురం లోని నివాసం నుంచి.. తూంసి వద్ద నిర్వహించే ప్రజా వేదిక వరకు ఈ సైకిల్ తో ర్యాలీగా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. మొత్తం 5,555 సైకిళ్లను లబ్ధిదారులకు చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా ఈ సైకిల్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 24 గంటలు వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ సైకిల్స్ ను లబ్ధిదారులకు అందించడం గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కటం గమనార్హం. ఈ మోటార్డ్ అనే సంస్థ తయారు చేసి కుప్పంలోని యూనిట్ లో అసెంబ్లింగ్ చేసింది. వాటిని ముందుగా తన నియోజకవర్గ ప్రజలకు అందించారు చంద్రబాబు.

Also Read : బూతులతో రెచ్చిపోయిన అంబటి..!

అయితే ఆయన ర్యాలీగా వెళ్లే సమయంలో సైకిల్ తొక్కిన విధానం, చంద్రబాబులోని ఎనర్జీ సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. సైకిల్ తొక్కుతున్న సమయంలో చంద్రబాబు హావభావాలు కూడా వైరల్ అయ్యాయి. దీనిపై పలువురు కామెంట్ చేస్తూ చంద్రబాబు 75 ఏళ్ల వయసులో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారని, టిడిపిలోని చాలామంది నాయకులతో పాటుగా ఇతర పార్టీలలోని నాయకులు కూడా ఆయనలా ఫిట్నెస్ సాధిస్తే మరింతకాలం రాజకీయాలు చేసే అవకాశం దొరుకుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రజాధరణ ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని.. వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆ స్థాయిలో ఫిట్నెస్ సాధిస్తే సక్సెస్ అదే వస్తుందంటూ మరి కొంతమంది చంద్రబాబును అభినందిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్