Wednesday, February 4, 2026 06:38 AM
Wednesday, February 4, 2026 06:38 AM

మంచు కొండల్లో చుక్కలు చూపిస్తున్న ఇండియన్ ఆర్మీ..!

మంచు కొండల్లో భారత ఆర్మీ సింహ గర్జన చేస్తోంది. దొంగచాటున కాశ్మీర్ లోయలో అడుగు పెడుతోన్న ఉగ్రవాదులను మాటు వేసి వేటాడుతోంది. 14 రోజుల క్రితం ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ దెబ్బకు ఉగ్రవాదులకు చుక్కలు కనపడుతున్నాయి. ఉగ్రవాదుల వేట కొరకు ఆపరేషన్ ట్రాషి-I ను చేపట్టింది ఇండియన్ ఆర్మీ. ఈ ఆపరేషన్ 14వ రోజున.. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున రంగంలోకి దిగాయి బలగాలు.

Also Read : లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి.. బోర్డుకు గంభీర్ రిక్వెస్ట్

డోల్గామ్ ప్రాంతంలో వైట్ నైట్ కార్ప్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించాయి. కార్దన్ సెర్చ్ ఆపరేషన్ కూడా బలగాలు నిర్వహించి దాడులకు దిగాయి. జనవరి 18న ఈ ఆపరేషన్ ను మంచు పర్వతాలు, కఠినమైన వాతావరణం, కఠిన భూభాగం ఉన్న ప్రాంతాల్లో చేపట్టారు. దట్టమైన అడవులు, మంచు పరిస్థితులను వాడుకుని ఉగ్రవాదులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా.. ఆ ప్రాంతాల్లో గురి పెట్టారు. తాజా ఆపరేషన్ లో ముగ్గురు ఉగ్రవాదులను లేపేసింది ఆర్మీ.

Also Read : దుర్గమ్మ సన్నిధిలో రౌడీ రాజ్యం.. సెక్యూరిటీ ఏజెన్సీ దారుణాలు..!

కిష్త్వార్ జిల్లాలో ముగ్గురు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ.. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు ముమ్మరం చేసిన కొన్ని గంటలకే తాజా ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. జనవరి 22న మాలి డానా టాప్ వద్ద, జనవరి 25న జాన్సీర్-కాండివార్ ప్రాంతంలో బలగాలు కాల్పులకు దిగి.. పలువురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి. ముందుజాగ్రత్త చర్యగా, సింగ్‌పురా, అరిగం, ద్వాథర్ మరియు నైద్గామ్‌తో సహా అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది ప్రభుత్వం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్