Sunday, September 20, 2026 01:06 AM
Sunday, September 20, 2026 01:06 AM

చివరి కోరిక తీరకుండా కన్నుమూసిన అజిత్ పవార్..?

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే సంకేతాలు కనపడుతున్నాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ డిప్యూటి సిఎం అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు రెండుగా చీలిపోయిన ఎన్సీపీ ఒకటి అయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియా తెలిపింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లోని రెండు వర్గాలు తిరిగి కలుస్తాయని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఫిబ్రవరి రెండవ వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట.

Also Read : డేంజర్ లో మేడిగడ్డ.. కేంద్రం హెచ్చరిక

బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ విలీనానికి మార్గం సుగమం చేశారని, డిసెంబర్, జనవరిలో శరద్ పవార్‌తో పలు సమావేశాలు నిర్వహించారని జాతీయ మీడియా తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇద్దరు నాయకులు సంయుక్త విలేకరుల సమావేశం ద్వారా విలీనాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విలీనాన్ని ఖరారు చేయడానికి రెండు వర్గాల నాయకులు వచ్చే వారం సమావేశం కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Also Read : దుర్గమ్మ సన్నిధిలో రౌడీ రాజ్యం.. సెక్యూరిటీ ఏజెన్సీ దారుణాలు..!

అయితే, అజిత్ పవార్ వర్గానికి చెందిన కొంతమంది నాయకులు తక్షణ విలీనాన్ని కోరుకోవడం లేదని, ఎందుకంటే దీనిని రాజకీయ లాభం కోసం వాడుకునే అవకాశం ఉందనే భావన వారిలో ఉందట. కానీ శరద్ పవార్ వర్గం మాత్రం తక్షణ విలీనాన్ని కోరుతోంది. విలీన ప్రక్రియలో సునేత్రా పవార్ పాత్ర కీలకమని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. శరద్ పవార్ కాకుండా, విలీనమైన పార్టీకి నాయకత్వం వహించే అవకాశం ఉన్న మరో ముగ్గురు ప్రముఖ నేతలు ఉన్నారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ నాయకత్వం వహించే సంకేతాలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్