Sunday, September 20, 2026 01:55 AM
Sunday, September 20, 2026 01:55 AM

పిఠాపురంలో సైనికులు పార్టీ పరువు తీస్తున్నారా..?

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో ఎదురవుతున్న పరిణామాలు ఇప్పుడు జనసైనికులను ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా పార్టీ బలపడుతుంది అనుకున్న సమయంలో, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఆ పార్టీ అధిష్టానాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడుతోంది. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ నుంచి, పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Also Read : బూతులతో రెచ్చిపోయిన అంబటి..!

ఆ తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన, మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో జనసేన పార్టీ కార్యకర్తలు గాని, కాకినాడ ఎంపీ గాని వ్యవహరించిన శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నాగబాబు కామెంట్స్ తో పిఠాపురం నియోజకవర్గంలో, తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేనగా వాతావరణ మారింది. అయితే క్రమంగా కూటమిలో విభేదాలు తగ్గుముఖం పట్టిన సమయంలో, ఇప్పుడు జనసేన పార్టీలో వర్గ విభేదాలు ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.

ఏ కార్యక్రమం జరిగినా సరే జనసైనికులు అనుసరిస్తున్న వైఖరి, అధిష్టానాన్ని మరింతగా ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. తాజాగా గొల్లప్రోలు మండలం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో, శుక్రవారం మండల అధ్యక్షులు ఎన్నికలు జరగగా.. పిఠాపురం పట్టణం, పిఠాపురం రూరల్, గొల్లప్రోలు పట్టణం, గొల్లప్రోలు రూరల్ మండలాలకు ఎన్నికలను నిర్వహించారు. అయితే కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఎన్నిక వాయిదా పడడంతో ఒక వర్గం నాయకులు ఆందోళనకు దిగారు.

Also Read : మంచు కొండల్లో చుక్కలు చూపిస్తున్న ఇండియన్ ఆర్మీ..!

ఎన్నికలు జరపాలంటూ కార్యాలయం వద్ద రచ్చ రచ్చ చేసి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అధువులోకి తీసుకొచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో పిఠాపురం జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా నాయకుల మధ్య గొడవలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి సిఐ శ్రీనివాస్ నేరుగా వార్నింగ్ ఇచ్చారనే వార్తలు వచ్చాయి. అయితే పోలీసుల జోక్యంతో విభేదాలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, కూడా రాజకీయ సమస్యలు పార్టీని వెంటాడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్