Saturday, September 19, 2026 08:13 PM
Saturday, September 19, 2026 08:13 PM

మాట మార్చిన పాక్.. టి20 వరల్డ్ కప్ లో కష్టమేనా..?

బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో ఆడేది కష్టంగానే కనపడుతోంది. బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలుస్తూ ముందు కామెంట్ చేసి.. ఆ తర్వాత 15 మంది సభ్యుల జట్టుని ప్రకటించింది. అయితే.. బోర్డు అధ్యక్షుడు నఖ్వీ మరోసారి మాట మార్చారు. ఆదివారం లాహోర్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లను, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్‌ ను కలిసి.. ఆ తర్వాత కీలక ప్రకటన చేసారు. జట్టును ప్రకటించినా.. ఆడే అంశం మాత్రం ప్రభుత్వంపై ఆధారపడి ఉందన్నారు.

Also Read : మా జీవితాలు నాశనం.. బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!

పాకిస్తాన్ వైఖరి ప్రభుత్వ స్థాయిలో ముడిపడి ఉందని, ముఖ్యంగా భారత్, శ్రీలంకలో మ్యాచ్ లు జరుగుతున్న నేపధ్యంలో.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంటూ ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఆటగాళ్ళు బోర్డుకు మద్దతు ఇవ్వడం గమనార్హం. జట్టు ఎంపిక అనేది వరల్డ్ కప్ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ కాదన్నారు. తాము ప్రభుత్వ సలహా కోసం ఎదురు చూస్తున్నామని , ప్రభుత్వం ఏమి చేయమని చెబితే అది చేస్తామని చెప్పడంతో మరోసారి సందిగ్దత నెలకొంది. ప్రపంచ కప్ కు వద్దంటే ఆ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తామన్నారు నఖ్వీ.

Also Read : తర్వాతి కెప్టెన్ అతనే.. షైన్ అవుతున్న శర్మ..!

ఆస్ట్రేలియాతో జరిగే స్వదేశీ వైట్-బాల్ సిరీస్, ప్రపంచ కప్‌కు ముందు అభిమానులకు పాకిస్తాన్ ఆటగాళ్ళపై భారీ అంచనాలు పెట్టుకున్నారని, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరాడు. ఆదివారం సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని 15 మంది సభ్యుల టీ20 ప్రపంచ కప్ జట్టును పాకిస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జరిగిన సమావేశంలో, భద్రతా కారణాల దృష్ట్యా భారత్ వెళ్లడానికి ఇష్టపడని కారణంగా బంగ్లాదేశ్‌ ను టీ20 ప్రపంచ కప్ నుండి మినహాయించడంపై పీసీబీ విధానం గురించి నఖ్వీ ఆటగాళ్లకు వివరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్