Sunday, June 21, 2026 07:46 AM
Sunday, June 21, 2026 07:46 AM

కారు ప్రియులకు కేంద్రం గుడ్ న్యూస్..!

అంతర్జాతీయంగా అమెరికా సృష్టిస్తున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 2025 ప్రారంభం నుంచి సుంకాల పేరుతో డోనాల్డ్ ట్రంప్ అనేక ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో యూరోపియన్ యూనియన్ కు భారత ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. దేశంలో యూరోపియన్ యూనియన్ ఉత్పత్తుల ధరలు తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. యూరోపియన్ యూనియన్ నుండి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 110% నుండి 40%కి తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Also Read : పొలిటికల్ బ్యాక్ డ్రాప్.. బాలయ్య కోసం మలినేని ప్లాన్..!

రెండు వైపులా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపధ్యంలో.. ఈ నిర్ణయం తీసుకునే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. 27 దేశాలు ఉన్న ఈ కూటమి నుంచి వచ్చే కార్ల ధరలు భారత్ లో తగ్గే అవకాశం కనపడుతోంది. 15,000 యూరోల ($17,739) కంటే ఎక్కువ దిగుమతి ధర కలిగిన కార్లపై పన్నును వెంటనే తగ్గించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు రాయిటర్స్ పేర్కొంది. కాలక్రమేణా ఇది 10%కి తగ్గించనున్నారు. వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి యూరోపియన్ ఆటోమేకర్లకు భారత మార్కెట్‌లోకి ప్రవేశం సులభతరం కానుంది.

Also Read : రాజధాని అమరావతిలో అట్టహాసం: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఆత్మవిశ్వాసం

చర్చలు గోప్యంగా ఉండటం, చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉండటంతో దీనిపై ప్రభుత్వ వర్గాలు ఇంకా స్పందించలేదు. అమెరికా, చైనా తర్వాత అమ్మకాల పరంగా భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్. ప్రస్తుతం దిగుమతి చేసుకున్న కార్లపై 70% మరియు 110% సుంకాలను విధిస్తోంది. దీనిపై టెస్లా అధినేత మస్క్ అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. భారతదేశంలోని సంవత్సరానికి 4.4 మిలియన్ యూనిట్ల కార్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 4% కంటే తక్కువ యూరోపియన్ యూనియన్ కార్లు విక్రయిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్