Wednesday, August 5, 2026 11:54 AM
Wednesday, August 5, 2026 11:54 AM

తర్వాతి కెప్టెన్ అతనే.. షైన్ అవుతున్న శర్మ..!

టి 20లకు సూర్య కుమార్ యాదవ్ తర్వాత కెప్టెన్ ఎవరు అనేదానిపై ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది. టి20 వరల్డ్ కప్ తర్వాత సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ పదవికి దాదాపుగా రాజీనామా చేయడమే కాకుండా ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే అవకాశం కూడా ఉంది. న్యూజిలాండ్ తో సీరిస్ గా ముందు ఫామ్ లో లేక ఇబ్బంది పడిన సూర్య కుమార్ యాదవ్.. ఈ సిరీస్ లో కాస్త పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టులకు సూర్యకుమార్ యాదవ్ ను పక్కన పెట్టింది టీమిండియా యాజమాన్యం. దీనితో టి20 వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా క్రికెట్ కు దూరమయ్యే ఛాన్స్ కనబడుతోంది.

Also Read : వైవీ సుబ్బారెడ్డికి చేదు అనుభవం..!

మరి ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు చేపడతారు అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడే బూమ్రా, హార్దిక్ పాండ్యాకు ఆ అవకాశం దాదాపుగా లేదని చెప్పాలి. అక్షర్ పటేల్ పేరు వినపడుతున్నప్పటికీ ఎంతవరకు అతనికి ఆ బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై కూడా స్పష్టత రావడం లేదు. అయితే అభిషేక్ శర్మ పేరు ఎక్కువగా వినపడుతోంది. గత ఏడాది కాలంలో టి20 జట్టులో అత్యంత కీలకంగా మారిన ఆటగాళ్లలో ఒకడు అభిషేక్ శర్మ. దూకుడుగా ఆడటమే కాకుండా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు అభిషేక్ శర్మ.

Also Read : కల్తీ లడ్డూ.. వైసీపీ గప్ చుప్..!

దీనితో అతనికి కెప్టెన్ పదవిని అప్పగించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటుగా సెలెక్టర్లు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ ఆడనున్నారు. టి20 లకు మరో ఆరు నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో.. ఐపీఎల్ తర్వాత నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. బ్యాటింగ్ తో పాటుగా అవసరమైన సమయంలో బౌలింగ్ కూడా చేయగలిగే సామర్థ్యం అభిషేక్ శర్మ సొంతం. ఆస్ట్రేలియాలో కూడా అభిషేక్ శర్మ సక్సెస్ అయ్యాడు. అందుకే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే నిర్ణయానికి ఇప్పటికే యాజమాన్యం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇంగ్లాండ్ లో భారత్ ఆడబోయే టి20 లకు అభిషేక్ శర్మ సారధ్య బాధ్యతలు నిర్వహిస్తాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్