Sunday, March 22, 2026 10:08 AM
Sunday, March 22, 2026 10:08 AM

మరో యుద్ధం దిశగా ట్రంప్ అడుగులు..?

మధ్యప్రాచ్యంలో బలమైన దేశంగా ఉన్న ఇరాన్ లో ఇప్పుడు వాతావరణం వేడెక్కింది. ఎలాగైనా సరే ఇరాన్ పై ఆధిపత్యం చేలాయించాలి అని ప్రయత్నం చేస్తోన్న అగ్ర రాజ్యం అమెరికా.. అక్కడ జరుగుతోన్న అల్లర్లను తనకు అనుకూలంగా మార్చుకునే అడుగులు వేగవంతం చేస్తోంది. ఇస్లామిక్ దేశంలో జరుగుతోన్న అల్లర్లలో వేలాది మంది మరణించిన అనంతరం.. ఇరాన్ లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా తన సైనిక బలగాలను పెద్ద ఎత్తున మొహరించే ప్రయత్నాలను మొదలుపెట్టింది.

Also Read : సాయిరెడ్డి రాజకీయ ప్రయాణం అటేనా..?

మధ్యప్రాచ్యంలో అమెరికా విమాన వాహక నౌకలను, యుద్ధ విమానాలను మోహరిస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి మిశ్రమ సంకేతాలతో మధ్య ప్రాచ్యంలో వాతావరణం వేడెక్కింది. మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ను అమెరికా బలోపేతం చేస్తోందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఎఫ్’-15ఈ స్ట్రైక్ ఈగిల్ జెట్‌ లను, విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ ను వ్యూహాత్మకంగా ఇరాన్‌కు దగ్గరగా తీసుకు వెళ్ళింది.

Also Read : తెలంగాణలో ఫిబ్రవరి నుంచే ఎన్డీయే వార్ షురూ..?

అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా మధ్యప్రాచ్యంలో తన వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేసింది. గురువారం ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ వైపు సైనిక దళాలు కదులుతున్నట్టు ప్రకటించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఏం జరగకూడదు అనేది తమ కోరికగా చెప్పిన ట్రంప్.. ఇరాన్ లో ఏం జరుగుతుందో గమనిస్తున్నామో చెప్పుకొచ్చారు. దావోస్ లో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌పై సైనిక చర్య అవసరం ఉండదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్షలను నిలిపివేస్తుందని హామీ ఇచ్చిన తర్వాత ట్రంప్ సైనిక చర్యను గతంలోనే విరమించుకున్నారని అమెరికన్ మీడియా పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్