Wednesday, August 5, 2026 01:17 PM
Wednesday, August 5, 2026 01:17 PM

బంగారం కొనగలమా..? రాకెట్ కంటే వేగంగా..!

భారత్ లో బంగారంపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. ఏ ఫంక్షన్ జరిగినా సరే బంగారం కీలకం. బంగారం కోసం తల్లిని వేధించే కూతుళ్ళు.. అత్తను వేధించే కోడళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. వాడకం ఎక్కువగా ఉండటంతో ధరల పెరుగుదల కూడా అదే రేంజ్ లో ఉంటుంది అని చెప్పుకోచ్చు. తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. మొన్నటి వరకు ఫంక్షన్ లు లేకపోవడంతో కొంత స్లోగా ముందుకు వెళ్ళిన బంగారం ఇప్పుడు శుభకార్యాలు రావడంతో వేగం అందుకుంది అనే చెప్పాలి.

Also Read : జనసేనాని స్పీడ్.. అరకులో ఇల్లు కడతారా..?

తాజాగా బంగారం ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. సామాన్యులకు అందనంత దూరంలో బంగారం ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1.60,340, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.48,470, హైదరాబాద్ లో కిలో వెండి రూ.3,30,000 చేరుకున్నాయి. ఒక్కరోజే రూ.5,380 పెరిగింది 24 క్యారెట్ల బంగారం. ఇక ఒక్కరోజే రూ.4980.. 22 క్యారెట్ల బంగారం పెరిగింది. దీనితో బంగారం కొనాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. సామాన్యులకు బంగారం దాదాపుగా దూరమైంది.

Also Read : అంతా హరీష్ మాయ.. కేటీఆర్ మసకబారుతున్నారా..?

అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో బంగారం రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంఘర్షణలు, చైనా-అమెరికా ట్రేడ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భయాన్ని పెంచుతున్నాయి. పెట్టుబడిదారులు స్టాక్స్‌కు బదులు బంగారం వైపు మళ్లారు. దీనితో బంగారం ధర భారీగా పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచిన సుంకాల ప్రభావం కూడా భారీగా ఉంది. ఇక భారత్ లో డిమాండ్ కూడా బంగారం ధర పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

పోల్స్