Wednesday, August 5, 2026 07:53 AM
Wednesday, August 5, 2026 07:53 AM

ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోన్న పవన్ లుక్స్.. హ్యాండ్సం డిప్యూటీ సీఎం..!

సాధారణంగా సినిమా నటులు తమ సినిమాలు పూర్తయ్యే వరకు తమ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. దర్శకులు తమ కథలో హీరో ఎలా ఉండాలో ఒక ప్లాన్ చేసుకుని రెడీ చేస్తూ ఉంటారు. అందుకే ఆ లుక్ తో అభిమానులకు కనపడకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ పబ్లిక్ లైఫ్ లో ఉండేవాళ్లకు మాత్రం ఇది ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో పడిన పవన్ కళ్యాణ్.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం లుక్ మార్చేశారు.

Also Read : తమిళ సూపర్ స్టార్ అవ్వాలనే అల్లు అర్జున్ ప్రయత్నం ఫలిస్తుందా?

దీనితో.. స్టైలిష్ డిప్యూటీ సీఎం లుక్స్ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఎక్కువకాలం జుట్టు పెంచి గడ్డంతో కనబడిన పవన్ కళ్యాణ్.. ఈమధ్య గడ్డం పెంచి హెయిర్ స్టైల్ కూడా మార్చారు. షార్ట్ హెయిర్, సాల్ట్ పెప్పర్ లుక్ లో కనబడుతున్నారు జనసేనాని. ఇటీవల పిఠాపురం వెళ్లిన సమయంలో హుడీ ధరించి కనిపించారు. సాధారణంగా రాజకీయ నాయకులు.. తెల్ల వస్త్రాల్లో కనపడుతూ ఉంటారు. కానీ పవన్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా కనపడటం.. స్టైలిష్ గా ఉండటంతో ఆ ఫోటోలో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఎర్రచందనం పరిశీలించిన సమయంలో పవన్ ప్రొఫెషనల్ గా కనిపించారు.

Also Read : విజయసాయి కి ఈడీ నోటీస్: జగన్ అరెస్టుకు సన్నాహామేనా?

ఆ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా కాకినాడలో అధికారిక కార్యక్రమానికి వెళ్ళిన సమయంలో కూడా పవన్ స్టైలిష్ గానే ఉన్నారు. పవన్ బాడీ లాంగ్వేజ్ కూడా కొంత మారినట్లు కనపడటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సాధారణంగా రాజకీయాల్లోకి రాకముందు పవన్ ఎక్కువగా మీడియాలో కనపడేవారు కాదు. అప్పుడప్పుడు రిలీజ్ అయ్యే ఆయన ఫోటోలు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకునేవారు. కానీ ఇప్పుడు రెగ్యులర్ గా పవన్ మీడియాలో కనపడటం.. సినిమాల్లో చూపించే పవర్ఫుల్ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో కనపడటంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా పవన్ ను ఫాలో అవుతున్నారు. తమ డిప్యూటీ సీఎం ఇలాగే ఉండాలంటూ మరికొంతమంది ఫాన్స్ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్