Tuesday, November 3, 2026 02:26 PM
Tuesday, November 3, 2026 02:26 PM

ఈరోజు (18-01-2026) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, బహుళ పక్షం 18-01-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 18-01-2026

బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు దక్కుతాయి.

—————————————

వృషభం 18-01-2026

కుటుంబ సభ్యుల ప్రవర్తన శిరోబాధ కలిగిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమధిక్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలున్నవి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

—————————————

మిధునం 18-01-2026

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల పరంగా ఇబ్బందులు అధిగమించి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

—————————————

కర్కాటకం 18-01-2026

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి.

—————————————

సింహం 18-01-2026

ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులందు కార్యాటంకములు తప్పవు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు స్థానచలనాలుంటాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటారు.

—————————————

కన్య 18-01-2026

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ద వహించాలి.

—————————————

తుల 18-01-2026

రాజకీయ సభ సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

—————————————

వృశ్చికం 18-01-2026

వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

—————————————

ధనస్సు 18-01-2026

పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.

—————————————

మకరం 18-01-2026

ధన సంభంధిత వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన ఆర్ధిక నష్టాలు తప్పవు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో కీలక వ్యవహారాలు చర్చిస్తారు.

—————————————

కుంభం 18-01-2026

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి.

—————————————

మీనం 18-01-2026

దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో ఆకారణంగా విబేదిస్తారు.

—————————————

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: బెజవాడకు వరద...

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షం...

సీఎం చంద్రబాబుకు అమిత్...

ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుపాన్లు వణికిస్తున్న నేపథ్యంలో...

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో...

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేపిన మున్సిపల్ కార్పొరేషన్...

మళ్లీ యాత్రల సమయం.....

"మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. ఎవరెన్ని యాత్రలు...

మాటల యుద్ధానికి తెర.....

ఎన్నికల సమరం ముగిసింది.. ఇక రాజకీయ...

తక్కువ పోలింగ్ కారణాలేమిటీ..?

తిరుపతి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో...

పోల్స్