Wednesday, February 4, 2026 11:29 AM
Wednesday, February 4, 2026 11:29 AM

వందే భారత్ స్లీపర్ ట్రైన్ చార్జీలు, షాకింగ్ ప్రత్యేకతలు ఇవే..!

భారత రైల్వే రంగంలో సమూల మార్పులకు రంగం సిద్దం చేస్తోన్న భారత రైల్వే శాఖ.. ఇప్పుడు వందే భారత్ ట్రైన్ లో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. వేగం విషయంలో మంచి పేరు తెచ్చుకున్న వందే భారత్ లో ఇప్పటి వరకు స్లీపర్ లేకపోవడంతో.. స్లీపర్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ స్లీపర్ ట్రైన్ లో ఉన్న సదుపాయాలపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. తక్కువ ప్రయాణించినప్పటికీ, 400 కి.మీ దూరం వరకు ఎంత ఛార్జ్ ఉంటుందో అదే వర్తిస్తుంది.

Also Read : తెలంగాణలో పవన్ తో బీజేపీ గేమ్ ప్లాన్ రెడీ..?

ప్రాథమిక ఛార్జీలు (జిఎస్టికి ముందు) ఒకసారి చూస్తే.. ఏసీ 3-టైర్ కి.మీ.కు రూ.2.4, ఏసీ 2-టైర్ కి.మీ.కు రూ.3.1, మరియు ఏసీ ఫస్ట్ క్లాస్ కి.మీ.కు రూ.3.8. చార్జ్ చేస్తారు. కనీస ఛార్జీలు (400 కి.మీ వరకు) ఏసీ 3-టైర్‌కు రూ. 960, ఏసీ 2-టైర్‌కు రూ. 1,240 మరియు ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ. 1,520, వర్తిస్తాయి. జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. ప్రయాణ దూరాలు పెరిగేకొద్దీ, ఛార్జీలు దామాషా ప్రకారం పెరుగుతాయి, దూర మార్గాల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ సర్వీసుల కంటే ఎక్కువగా చార్జ్ చేస్తారు.

Also Read : పోలవరం వాడుకోండి.. తెలంగాణాకు చంద్రబాబు చురకలు..!

ధనికులకు మాత్రమే ఈ రైలు అందుబాటులోకి తెచ్చారనే కామెంట్ వినపడుతోంది. రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్(ఆర్ ఏ సి) ఉండదు. వెయిటింగ్ లిస్ట్ కూడా ఉండదు. విమాన, బస్ టికెట్ ల మాదిరిగా ఖరారు చేసిన టికెట్ లు మాత్రమే ఉంటాయి. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ప్రకారం మొదటి రోజున అన్ని బెర్తులు విడుదల చేస్తారు. అలాగే వందే భారత్ స్లీపర్ పరిమితంగా రిజర్వేషన్ కోటాలో నడుస్తుంది. ఇందులో సీనియర్ సిటిజన్లు, మహిళా ప్రయాణీకులు, వికలాంగులు మరియు డ్యూటీ పాస్ కోటాలు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైళ్ల టికెట్ బుకింగ్‌లకు డిజిటల్ చెల్లింపు పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. తొలి వందే భారత్ స్లీపర్ సర్వీస్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి సమీపంలోని కామాఖ్య మధ్య దాదాపు 1,000 కి.మీ. దూరం ప్రయాణించనుంది. ప్రతి ప్రయాణీకుడికి వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. వీఐపీ విధానం ఈ ట్రైన్ లో అందుబాటులో ఉండదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

పోల్స్