Tuesday, August 4, 2026 09:15 PM
Tuesday, August 4, 2026 09:15 PM

పోలవరం వాడుకోండి.. తెలంగాణాకు చంద్రబాబు చురకలు..!

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరోసారి సిఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, సెక్రటరీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. జీఎస్‌డీపీ, 2047 విజన్‌లోని 10 సూత్రాలపై అధికారుల ప్రజెంటేషన్‌ ఇవ్వగా.. ఆదాయార్జన శాఖలు, కేంద్ర పథకాలు, పీపీపీ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దస్త్రాల పరిష్కారం, ఆన్‌లైన్‌ సేవలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌లపై సమీక్షిస్తున్నారు. ఇక ‘వీబీ జీ-రామ్‌-జీ’ పైన సైతం ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సిఎం కీలక వ్యాఖ్యలు చేసారు.

Also Read : శ్రీవారితో ఆటలు.. వైసీపీ నేతపై గురి..?

విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామని తెలిపారు. ప్రజల ఆశల్ని నిలబెట్టాం, వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించామన్నారు. 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చింది.. ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిచ్చారు సిఎం. తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2.0 వంటి 70 వరకూ పెద్ద పథకాలు, కార్యక్రమాలు, పనులు చేశామని తెలిపారు. ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించటంలో సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించామని తెలిపారు.

Also Read : రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రివ్యూ రిపోర్ట్

‘పోలవరం-నల్లమల సాగర్’ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. పోలవరం అత్యద్భుతమైన ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదన్నారు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది.. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నామన్నారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

Also Read : భూములను లాక్కోలేరు… రికార్డులు తారుమారు చేయలేరు

ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు.. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి..? అని నిలదీశారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తామని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్