Thursday, May 7, 2026 02:04 AM
Thursday, May 7, 2026 02:04 AM

ట్రాఫిక్ చలానాలపై కఠినత్వం.. రేవంత్ పై విమర్శల వెల్లువ

ట్రాఫిక్ చలానాల విషయంలో పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ప్రజలకు కొత్త విషయం కాదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం, కోర్టుల ఆదేశాల పేరుతో జరిమానాలు విధించడం, బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం ఇప్పటికే సాధారణంగా మారాయి. చలానాల వసూలు కోసం ఆఫర్లు ప్రకటించే స్థాయికి కూడా వ్యవహారం చేరిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

Also Read : భారత్ తో రాజీకి ట్రంప్ అడుగులు..? టూర్ ఫిక్స్ అయిందా..?

ఒక సభలో మాట్లాడిన సీఎం, ట్రాఫిక్ నిబంధనల అమలులో మరింత కఠినత అవసరమని, ట్రాఫిక్ ఫైన్ పడిన వెంటనే సంబంధిత వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా రూల్ తీసుకురావాలని పోలీసులకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఇంత కఠినత చూపాలని భావిస్తున్న ప్రభుత్వం, రోడ్డు ప్రమాదాల్లో నష్టపోయిన బాధితులకు కూడా ఇదే వేగంతో న్యాయం చేస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనాలు ధ్వంసమై, ప్రాణనష్టం జరిగితే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కలిగిన నష్టానికి పరిహారం కూడా అదే విధంగా వెంటనే ఖాతాల్లో జమ అవుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్న విమర్శలు కొనసాగుతున్నాయి. గుంతల రోడ్లు, ఇరుకైన మార్గాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల వికారాబాద్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది మరణించడం రోడ్డు విస్తరణలోని లోపాల వల్లే అన్న ఆరోపణలు వచ్చాయి.

Also Read : తెలంగాణలో పవన్ తో బీజేపీ గేమ్ ప్లాన్ రెడీ..?

ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజలపై మాత్రమే కఠిన చర్యలు తీసుకోవడం సమంజసమేనా అనే చర్చ మొదలైంది. ద్విచక్ర వాహనాలు, కార్లు సహా అనేక వాహనాలు రోడ్డు లోపాల కారణంగా ప్రమాదాలకు గురవుతున్న వేళ, పోలీసు వ్యవస్థ కూడా ట్రాఫిక్ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటిస్తున్నదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ బాధ్యత, మౌలిక సదుపాయాల లోపాలపై కూడా అదే స్థాయిలో జవాబుదారీతనం ఉండాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్