తెలంగాణాలో జనసేన పార్టీ దూకుడు పెంచనుందా..? పదేళ్ళ నుంచి సైలెంట్ గా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్దం చేస్తుందా..? ఏపీ డిప్యూటి సిఎంగా ఉన్న పవన్ కళ్యాణ్.. తెలంగాణాలో కూడా వ్యూహాలకు పదును పెడతారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2014 నుంచి తెలంగాణాలో పార్టీ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. పంచాయితీల్లో ఆ పార్టీ సానుభూతిపరులు పోటీ చేస్తున్నారు మినహా గ్లాసు గుర్తుతో పార్టీ ఇప్పటి వరకు బరిలోకి దిగలేదు.
Also Read : అమిత్ షాతో చంద్రబాబు హడావుడి భేటీ.. కారణమేంటి?
అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి పార్టీని బరిలోకి దించాలని పవన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావించినా.. పవన్ మాత్రం వెనక్కు తగ్గారు. ఇప్పుడు మాత్రం ఏపీ ఫార్ములాను తెలంగాణాలో కూడా వర్కౌట్ చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లో కనీసం పది స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. పవన్ ప్రస్తుతం తెలంగాణాలో పర్యటనలు చేయకపోయినా.. కొండగట్టు ఆలయానికి వెళ్తూ వస్తున్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసారు.
Also Read : ఐఏఎస్ భార్య మృతి.. ఎన్నో అనుమానాలు..!
అక్కడ చేపట్టిన నిర్మాణాలలో ఏదోక నిర్మాణం పూర్తైన తర్వాత.. ఆయనే ప్రారంభోత్సవం చేయనున్నారు. టీటీడీ నిధులు కూడా సమకూర్చడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవం చేసే నాడే.. తెలంగాణాలో రాజకీయ ప్రయాణంపై ప్రకటన చేసే అవకాశం కనపడుతోంది. ఇక త్వరలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను వేయనున్నారు. పార్లమెంటరీ కమిటీలను వేసవిలో ప్రకటించే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే కొన్ని పేర్లు ఖరారు అయినప్పటికీ కసరత్తు కొనసాగుతోందని తెలుస్తోంది.

