Wednesday, May 6, 2026 11:30 PM
Wednesday, May 6, 2026 11:30 PM

పాదయాత్ర దిశగా బీఆర్ఎస్ అడుగులు..? చేసేది ఎవరు..?

తెలంగాణాలో భారత రాష్ట్ర సమితిని గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం నానా కష్టాలు పడుతోంది. సిఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే విషయంలో ఇబ్బంది పడుతోన్న పార్టీ.. భవిష్యత్తు ప్రణాలికల విషయంలో తల మునకలు అవుతోంది. ఇప్పుడు కేసీఆర్ బయటకు రాకపోవడంతో కేటిఆర్, హరీష్ రావుపై పార్టీ ని నడిపించే భారం పడింది. కేసీఆర్ గతంలో మాదిరిగా పోరాడే పరిస్థితి కనపడటం లేదు. ఈ తరుణంలో పార్టీ క్యాడర్ లో కూడా కొంత ఆందోళన కనపడుతోంది. ప్రభుత్వాన్ని శాసనసభలో కూడా ఇరుకున పెట్టడంలో ప్రతిపక్షం ఫెయిల్ అవుతోందనే భావన వ్యక్తమవుతోంది.

Also Read : హీరోయిన్‌ పై కడప రౌడీయిజం.. పూనమ్‌ కౌర్‌ని బెదిరించింది ఎవరు?

ఈ నేపధ్యంలో కేటిఆర్ ఓ కీలక అడుగు దిశగా ప్రణాలికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. పాదయాత్రకు రంగం సిద్దం చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 2027 జూన్ నుంచి పాదయాత్రకు సిద్దం కావాలని భావిస్తున్నారట. పార్టీ క్యాడర్ లో జోష్ నింపాలన్నా, ప్రజల్లోకి పార్టీ వెళ్ళాలన్నా పాదయాత్ర కరెక్ట్ అనే భావనలో కేటిఆర్ ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో పార్టీ ఫెయిల్ అవుతుందనే భావన నేపధ్యంలో.. నియోజకవర్గ స్థాయి పర్యటనలు చేయాలని కేటిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : షమీని కూడా వదల్లేదు.. తెలుగు యువకుడి వీర విహారం

అయితే ఇక్కడ హరీష్ రావు కూడా పాదయాత్ర చేయాలనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. క్యాడర్ లో జోష్ నింపడంలో కేటిఆర్ కంటే హరీష్ సమర్ధ నేత అనే అభిప్రాయం వినపడుతోంది. కేటిఆర్ ది దూకుడు స్వభావం కాబట్టి ఆయన ప్రజల్లో మమేకం కాలేరు అనేది ఆ పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయం. గతంలో కేటిఆర్ సిఎం కావడాన్ని అడ్డుకున్న కొందరు నేతలు కూడా.. హరీష్ పాదయాత్ర చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే హరీష్ మాత్రం పాదయాత్రకు సిద్దంగా లేరనే మాట పార్టీ వర్గాల్లో వినపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్