Wednesday, May 6, 2026 09:28 PM
Wednesday, May 6, 2026 09:28 PM

హీరోయిన్‌ పై కడప రౌడీయిజం.. పూనమ్‌ కౌర్‌ని బెదిరించింది ఎవరు?

క్రిమినల్స్‌ రాజకీయాలు చేస్తే.. ఎవరికీ రక్షణ ఉండదు. ఒక హీరోయిన్‌ను పోలీసులే కిడ్నాప్‌ చేస్తారు. మరో హీరోయిన్‌ న్యూడ్‌ వీడియోలు క్రియేట్‌ చేస్తామని రాజకీయ ముసుగేసుకున్న రౌడీలు బెదిరిస్తారు. ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే ఈ దురాగతాలు జరిగాయి. నటి పూనమ్ కౌర్‌ తనకు జరిగిన అన్యాయం గురించి ఓ ఇంటర్యూలో వివరించారు. పోలిటీషియన్‌గా మారిన స్టార్‌ హీరోని బద్నాం చేసేలా ప్రెస్‌ మీట్‌ పెట్టాలని కడపకు చెందిన కొందరు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారట. డబ్బులు, పదవులు ఇస్తామని ఆశ పెట్టినా ఆమె లొంగకపోవడంతో.. న్యూడ్‌ వీడియోలు తయారు చేసి.. ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరించారంటూ తన గోడు వెళ్లబోసుకున్నారు.

Also Read : పరకామణిలో దొంగలు ఈ పోలీసులేనా..?

రాజకీయంగా ఎవరి సపోర్టు లేకపోవడంతో.. ఈ దారుణాలపై కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. ఇక సినిమా యాక్టర్, అప్పట్లో వైసీపీ లీడర్‌గా ఉన్న పోసాని కృష్ణ మురళి ప్రెస్‌మీట్‌ పెట్టి తన గురించి దారుణంగా మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు పూనమ్‌ కౌర్‌. అతని కామెంట్స్‌తో ఆమె పెళ్లి ఆగిపోయింది.. తల్లికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఒక పార్టీ రాజకీయాల వల్ల సంబంధం లేని అమ్మాయి లైఫ్‌ ఎలా నాశనమైతే.. ఆమె గురించి అవాకులు.. చవాకులు పేలిన నేత వందల కోట్లు వెనుకేసుకున్నాడు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసే పార్టీ ఇప్పటకీ మారలేదు. అలాంటి పార్టీని.. నాయకులను అడ్డంగా సపోర్ట్‌ చేసే వాళ్లు మారలేదు.

Also Read : పాక్ వక్ర బుద్ధి.. భారత చిన్నారులను రిక్రూట్ చేస్తున్న ఐఎస్ఐ..?

రాక్షస రాజ్యంలో ఎవరికీ రక్షణ ఉండదు. పొలిటికల్‌గా అడ్డొస్తున్నాడని సొంత బాబాయ్‌ మీదే గొడ్డలి వేటేసిన వాళ్లు.. తమ రాజకీయం కోసం.. బలం, బలగం లేని ఉత్తరాది ఆడపిల్లని పావుగా మార్చాలనకోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రజాస్వామ్యంలో.. పాలకుల స్థానంలో ఉండే వారికి.. ప్రజలు ఏమనుకొంటారో అనే జంకు ఉండాలి. ఎవరు ఏమనుకున్నా.. మాకేటి సిగ్గు.. అని అన్నీ వదిలేసి.. సిద్ధం.. యుద్ధం అంటూ రప్పా రప్పా.. రంకెలేసే వాళ్లని నెత్తి మీద పెట్టుకుంటే.. అది అందరి పాలిటి భస్మాసుర హస్తం అవుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్