Saturday, September 19, 2026 06:48 AM
Saturday, September 19, 2026 06:48 AM

పాక్ వక్ర బుద్ధి.. భారత చిన్నారులను రిక్రూట్ చేస్తున్న ఐఎస్ఐ..?

అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఎన్ని విధాలుగా ఎండగట్టినా, సరిహద్దుల్లో ఏ విధంగా బుద్ధి చెప్పినా.. ఆ దేశం వైఖరి మాత్రం భారత్ విషయంలో మారడం లేదు. సరిహద్దు రాష్ట్రాల్లో ఆ దేశం అనుసరిస్తున్న విధానాలు కలవరపెడుతున్నాయి. తాజాగా మరోసారి పాక్ తన బుద్ధిని ప్రదర్శించింది. భారత సమాచారాన్ని సేకరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోన్న పాక్.. ఇప్పుడు ఏకంగా చిన్న పిల్లలను రంగంలోకి దించింది. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చిన్నారులను రిక్రూట్ చేస్తోంది.

Also Read :ఆ సీనియర్లకు పదవీ యోగం లేదా..?

ఈ విషయాన్ని తాజాగా నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ చిన్నారులను రిక్రూట్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. పంజాబ్ లో 15 ఏళ్ళ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గత ఏడాది కాలంగా భారత్ సమాచారాన్ని అతను పాక్ కు చేరవేస్తున్నట్టు గుర్తించారు. అతనిని పఠాన్‌ కోట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ బాలుడు తన మొబైల్ ఫోన్ ద్వారా భారత్ కు సంబంధించిన ముఖ్యమైన, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేస్తున్నట్టు గుర్తించారు.

Also Read : ఆ విషయంలో సారీ చెప్పిన అనసూయ..!

జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాకు చెందిన ఆ బాలుడు.. భద్రతా బలగాల క్యాంప్ లు, కదలికలు, ఆర్మీ అధికారుల ఫోటోలు వంటివి షేర్ చేస్తున్నట్టు గుర్తించారు. పఠాన్‌కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దల్జిందర్ సింగ్ ధిల్లాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మరో 20 నుంచి 30 మంది ఇదే పనిలో ఉన్నట్టు తేల్చారు. వారికి భారత కరెన్సీ రూపంలో పాక్ డబ్బులు చెల్లిస్తుందని అనుమానిస్తున్నారు. బాలుడి దగ్గర ఉన్న ఐఫోన్ లో కీలక సమాచారాన్ని పోలీసులు గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్