Wednesday, February 4, 2026 12:21 PM
Wednesday, February 4, 2026 12:21 PM

ఏపీలో అసలేం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాదిన్నర పూర్తి. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడాలి అనే స్లోగన్‌తో ఇటు ఏపీలో, అటు కేంద్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు చేతులు కలిపాయి. వైసీపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా 3 పార్టీలు చేతులు కలిపాయి. ఎన్నికల్లో అంతా కలిసి పనిచేశారు. వై నాట్ 175 అని చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్షహోదా కూడా రాకుండా చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 3 పార్టీలు ఏకంగా 164 సీట్లు సాధించాయి. అలాగే ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉన్నాయి. ప్రస్తుత చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ముగ్గురు మంత్రులుండగా.. బీజేపీ తరఫున సత్యకుమార్ యాదవ్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక అటు కేంద్రంలోని మోదీ క్యాబినెట్‌లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతుండగా.. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.

Also Read : వైయస్ భారతి పొలిటికల్ ఎంట్రీ ఫైనల్..? కీలక బాధ్యతల్లో మేడం..?

ఏపీలో కూటమి సర్కార్‌పై వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. శాంతిభద్రతలు మొదలు.. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మాణం.. వరకు ప్రతి విషయంలో రాజకీయ విమర్శలు చేస్తునే ఉన్నారు వైసీపీ నేతలు. తాజాగా భోగాపురం విమానాశ్రయం విషయంలో కూడా వైసీపీ నేతలుగా దూకుడుగా వ్యవహరించారు. భోగాపురం విమానాశ్రయం రికార్డు సమయంలో పూర్తి చేశామని తెలుగుదేశం పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ మాదంటే మాదని అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి భోగాపురం క్రెడిట్ మొత్తం చంద్రబాబు ఖాతాలో వేయాల్సిందే. హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణం సమయంలోనే MRO మెయింటనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ కూడా అందుబాటులో ఉండేలా చంద్రబాబుు ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. అవేవీ అవసరం లేదన్నారు. దీంతో శంషాబాద్ కేవలం రెగ్యులర్ విమానాశ్రయంగానే అందుబాటులోకి వచ్చింది. దీంతో భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నట్లు చంద్రబాబు 2015లోనే ప్రకటించారు.

Also Read : ఆ విషయంలో సారీ చెప్పిన అనసూయ..!

నిజానికి భోగాపురం విమానాశ్రయం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన అన్ని అనుమతులను 2018లోనే నాటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే ఏపీలో కడప, కర్నూలులో ఉడాన్ స్కీమ్ కింద కేంద్రం ఎయిర్ పోర్టులు నిర్మించింది. వీటికి నాటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు సంతరం చేశారు. భోగాపురం డీపీఆర్‌కు కూడా నాటి మోదీ సర్కార్ ఓకే చేసేసింది. అందుకే 2019 ఫిబ్రవరి 14న నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్.. భోగాపురం ఎయిర్ పోర్టును కుదించే ప్రయత్నం చేశారు. జీఎంఆర్ సంస్థకు 2,200 ఎకరాలు మాత్రమే కేటాయించారు. మిగిలిన 500 ఎకరాలు ప్రభుత్వం వద్దే ఉంచారు. చివరికి పరిపాలన అనుమతుల విషయంలో కూడా జీఎంఆర్ సంస్థ ప్రతినిధులకు వేధింపులు తప్పలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు మళ్లీ మొదలయ్యాయి. శరవేగంగా నిర్మాణం జరిగిన మాట అందరికీ తెలిసిందే.

Also Read : చెల్లెమ్మను ఎలా దారిలో పెట్టాలి..?

భోగాపురం పూర్తి పూర్తిగా జగన్ క్రెడిట్ మాత్రమే అనేది వైసీపీ నేతల మాట. దీనికి టీడీపీ నేతలు ఇవే అసలు నిజాలు అంటూ టైమ్ లైన్ కూడా విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందా.. లేక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. వైసీపీ నేతలు నేరుగా చంద్రబాబు పైనే విమర్శలు చేస్తున్నారు. దానికి టీడీపీ నేతలు మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన, ప్రభుత్వ నిర్మాణాలపైన కూడా వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి భోగాపురం విమానాశ్రయం చంద్రబాబు ఒక్కరి విజయం మాత్రమే కాదు. అది కూటమి సర్కార్ గెలుపు కూడా. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించిందనే చెప్పాలి. అయినా సరే.. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ తరఫున కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు వచ్చి వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వలేదు. ఇది కూటమి నిజానికి 2014 నుంచి 2018 వరకు ఏపీలోని చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. నాటి బాబు ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ మంత్రులున్నారు కూడా. అంటే భోగాపురం క్రెడిట్ బీజేపీకి కూడా వస్తుంది. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. మనకెందుకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబును అంటున్నారు.. కాబట్టి వైసీపీకి టీడీపీ కౌంటర్ ఇస్తుంది. మధ్యలో మనకెందుకు అని బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. దీంతో ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందా.. లేక చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ సర్కార్ అధికారంలో ఉందా అనే అనుమానం తలెత్తుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్