దండోరా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. ఈ వ్యవహారంలో నటి అనసూయ, గాయని చిన్మయ్ ఘాటుగా స్పందించడంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారింది. చివరికి నటుడు శివాజీ ఆ రెండు మాటలు అనటం తప్పే.. అంటూ క్షమాపణలు చెప్పినా సరే.. టార్గెట్ శివాజీ అన్నట్లుగా అనసూయ మాటల దాడి చేశారు. మహిళల వస్త్ర ధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన వచ్చింది. చివరికి జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా పరోక్షంగా అనసూయకు మద్దతు అన్నట్లుగా వీడియో రిలీజ్ చేయడంతో చివరికి రాజకీయంగా పెద్ద దుమారం రేపింది కూడా. ఇక మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీంతో గతంలో తన డ్రెస్సింగ్‌పైన పలు ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యల వీడియోలు, సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను నెటిజన్లు బయటకు తీశారు. శివాజీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది అనేలా టార్గెట్ అనసూయ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
Also Read : డొమెస్టిక్ క్రికెట్ కు వాల్యూ లేదా..? వాళ్లకు ఎందుకీ అన్యాయం..?
అనసూయ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది జబర్దస్త్ షో. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షో తొలి యాంకర్. అనసూయకు పేరు కూడా ఈ షో ద్వారానే వచ్చింది. 2012లో మొదలైన ఈ షో ద్వారా ఎంతో మంది నటీనటులు సినీ పరిశ్రమకు వచ్చారు. అనసూయ కూడా అంతకు ముందు క్యారెక్టర్ వేషాలు వేసినప్పటికీ.. జబర్దస్త్ షో ద్వారా మరింత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీగా మారిపోయిన అనసూయ ఇప్పటికీ అప్పుడప్పుడూ జబర్దస్త్ షోలో కనిపిస్తూనే ఉన్నారు. గతంలో ఈ షో యాంకర్‌గా ఉన్నప్పుడు అనసూయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మహిళల గౌరవం అంటూ మాట్లాడే అనసూయ.. మరో మహిళ గురించి కించపరిచేలా ఎలా మాట్లాడారంటూ విమర్శలు చేశారు. రాశి ఫలాలు అనే పదం మధ్యలో గారు అని అనసూయ అనటాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై తాజాగా నటి రాశి ఘాటుగా స్పందించారు. రాశి ఫలాల్లో తాను లేనని.. కానీ రాశి గారి ఫలాలు అనే మాటలో తాను ఉన్నానన్నారు. పరోక్షంగా అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాశి.. ఈ పదం ఓ మహిళ యాంకర్ అన్నారని.. దానికి అక్కడే ఉన్న ఓ మహిళా న్యాయ నిర్ణేత కూడా పగలబడి నవ్వారని మాజీ మంత్రి రోజా తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తాను అక్కడే ఉంటే.. ఏం మాట్లాడుతున్నావని నిలదీస్తానంటూ రాశి ఘాటుగా స్పందించారు. తనను మహిళా యాంకర్ బాడీ షేమింగ్ చేశారంటూ అనసూయ తీరుపై రాశి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఐఏఎస్ అధికారి సర్వీస్ పొడిగింపు వెనుక..!
రాశి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఈ అంశంపై నటి అనసూయ స్పందించారు. మరోసారి సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలిపారు అనసూయ. మై డియర్ రాశి గారు అంటూ బహిరంగ లేఖ రాశారు. “3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది. కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. Please accept my apologies.. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. People change and evolve, ఆ షో లో ద్వంద్వార్థపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి hate campaign నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను. i am more stronger and empowered than before to question the narratives built around women’s bodies. Hope you understand and lend your support.. wishing you well ma’am..” అంటూ అనసూయ పోస్ట్ చేశారు.
Also Read : చెల్లెమ్మను ఎలా దారిలో పెట్టాలి..?
అనసూయ పోస్టుపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. తెలుగు రాకుండానే తెలుగు టీవీ న్యూస్ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పని చేశారా.. తెలుగు టీవీ షోలో యాంకర్‌గా అన్నేళ్లు ఎలా పని చేశారని కౌంటర్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ చేసిన మూడేళ్ల తర్వాత తప్పు చేసినట్లు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే.. జబర్దస్త్ సహా ఇతర షో లలో కూడా అనసూయ చేసిన డబుల్ మీనింగ్ డైలాగ్ వీడియో క్లిప్పింగ్ బయటకు తీసి.. వీటికి కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ షో వల్లే అనసూయకు పేరు వచ్చిందని.. అప్పుడు డబ్బులు సంపాదించేందుకు డబుల్ మీనింగ్ డైలాగ్‌ల్లో ఎలాంటి తప్పు ఆమెకు కనిపించలేదని.. ఇప్పుడు మాత్రం ఇలా ప్లేటు తిరగేయటం ఏమిటని నిలదీస్తున్నారు. మరికొందరు అయితే.. ఈ విషయంలో అనసూయ భయపడినట్లు ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

