Wednesday, August 5, 2026 11:19 AM
Wednesday, August 5, 2026 11:19 AM

డొమెస్టిక్ క్రికెట్ కు వాల్యూ లేదా..? వాళ్లకు ఎందుకీ అన్యాయం..?

2024-25 ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన భారత జట్టు ఘోరంగా ఫెయిల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. గెలవాల్సిన మ్యాచ్ లలో కూడా చెత్త ఆట తీరు, తొందరపాటుతో మ్యాచ్ లను చేజార్చుకున్న పరిస్థితి మనం చూసాం. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆటగాళ్ళు అందరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆదేశాలు వెళ్ళాయి. దీనితో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ సహా కీలక ఆటగాళ్ళు అందరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడారు. ఆ తర్వాతి నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న ఆటగాళ్ళు ఆడుతూనే ఉన్నారు.

Also Read : బంగ్లా క్రికెట్ బోర్డు సముద్రం మీద అలుగుతోందా..?

ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే ట్రోఫీలో అంచనాలకు మించి మహ్మద్ షమీ, పడిక్కల్, శామ్సన్, గైక్వాడ్ రాణిస్తున్నారు. ఇక ఇటీవల సౌతాఫ్రికాతో రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో సైతం ఆకట్టుకున్నాడు. ఇక గాయం కారణంగా 2023 నుంచి జట్టుకు దూరమైన షమీ.. ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికీ వీరిలో ఏ ఒక్కరికి జట్టులో చోటు కల్పించలేదు సెలెక్టర్ లు.

Also Read : గురు శిష్యుల మధ్య జల రగడ.. చంద్రబాబు స్పందిస్తారా..?

డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోయినా హర్షిత్ రాణా, గిల్, ప్రసిద్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డిలకు జట్టులో చోటు కల్పించడం ఆశ్చర్యం కలిగించింది. విఫలమవుతోన్న ఆటగాళ్ళకు పదే పదే సెలెక్టర్లు అవకాశం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనితో డొమెస్టిక్ క్రికెట్ ప్రదర్శనకు విలువ లేదనే కామెంట్స్ వినపడుతున్నాయి. శుభమన్ గిల్ ఏదోక సాకుతో డొమెస్టిక్ క్రికెట్ ఆడకపోయినా.. మళ్ళీ అతనిని కెప్టెన్ గా ఎంపిక చేసారు. సిక్కింతో జరగాల్సిన మ్యాచ్ కు ఫుడ్ పాయిజన్ కారణంగా గిల్ తప్పుకోవడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్