Sunday, September 20, 2026 02:27 AM
Sunday, September 20, 2026 02:27 AM

బ్రేకింగ్: గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్..!

కన్నడ నాట కలకలం రేగింది. మైనింగ్ మాఫియా కింగ్, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై జరిగిన కాల్పుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఐరన్ ఓర్ తో కోట్ల రూపాయలు సంపాదించిన గాలి జనార్ధన రెడ్డి.. కాల్పుల దెబ్బకు బతుకు జీవుడా అంటూ పరుగులు తీసారు. అసలు ఏం జరిగింది.. ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే.. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటులో వివాదం చెలరేగి అక్కడి నుంచి చినికి చినికి గాలి వానగా మారింది. ఆ తర్వాతనే గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్టు కన్నడ పోలీసులు చెప్తున్నారు.

Also Read : చంద్రబాబు నాయుడు – గ్రీన్‌ఫీల్డ్ ఆర్కిటెక్ట్

బళ్లారిలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు కాల్పులకు దిగాడు. గన్‌మన్‌ తుపాకీ లాక్కుని రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి అనే వ్యక్తి. గాలి జనార్ధన్ రెడ్డి లక్ష్యంగానే ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. సతీష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఈ ఘర్షణల నేపధ్యంలో.. బళ్లారిలోని గాలి జనార్థన్ రెడ్డి, భరత్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. వాల్మీకి విగ్రహం ఉన్న బళ్లారి వాల్మీకి సర్కిల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేసారు.

Also Read : సోషల్ మీడియా వాడకపోతే ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..?

ఇతర ప్రాంతాల నుంచి బళ్లారికి భారీగా పోలీసులను చేరుకోవాలని ఆదేశించారు. దీనితో సమీపంలోని విజయనగర, చిత్రదుర్గ, కొప్పల్ ఎస్పీలు, పోలీసులను ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న షాపులను కూడా మూసివేసినట్టు తెలుస్తోంది. ఘర్షణలో చనిపోయిన రాజశేఖర్ కుటుంబాన్ని బళ్లారి విమ్స్ ఆస్ప్రతిలో భరత్ రెడ్డి పరామర్శించనున్న నేపధ్యంలో అక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేసారు. అటు భరత్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, శ్రీరాములుపై పోలీసులు కేసు నమోదు చేసారు. వారి అరెస్ట్ కు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్