Wednesday, August 5, 2026 03:07 PM
Wednesday, August 5, 2026 03:07 PM

ఏపీ వారికి రేవంత్ సంక్రాంతి గుడ్ న్యూస్..!

ఏది ఏమైనా తెలంగాణలోని ఆంధ్ర ప్రాంత వారి ఓట్ల కోసం అక్కడి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎక్కువగా కష్టపడుతున్నాయి. వలస వెళ్లి.. అక్కడ స్థిరపడిన వారి ఓట్లు కీలకంగా మారడంతో వారిని బుట్టలో వేసుకునేందుకు కష్టపడుతూ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటుగా సార్వత్రిక ఎన్నికల్లో సైతం వారు గేమ్ చేంజర్లు గా మారడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో ఉన్న భారత రాష్ట్ర సమితి సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ సమస్య రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Also Read : మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ఒంటరి అయ్యారా..?

సాధారణంగా సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి ఏపీ ప్రాంతానికి.. వెళ్తూ ఉంటారు. దీనితో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, కార్లు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వెళ్తాయి. దీనితో టోల్ గేట్ ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. టోల్ గేట్ల నిర్వాహకులకు భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు సంక్రాంతి కోసం వెళ్లే వారి కోసం టోల్ చార్జీలను తాము భరిస్తామని కేంద్రానికి లేఖ రాశారు రేవంత్ రెడ్డి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి 65 పై వెళ్లే వాహనాలకు టోల్ ఫీజులు తామే కడతామని తెలిపారు.

Also Read : నిజంగానే ఓటీటీలు అంత రేటు పెడుతున్నాయా..?

దీనివల్ల తెలంగాణ ప్రభుత్వంపై 40 కోట్ల రూపాయల భారం పడనుంది. జనవరి 11 నుంచి 18 వరకు సంక్రాంతి పండుగకు వెళ్లి వస్తారు. అప్పటివరకు దీనిని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రేవంత్ నిర్ణయం కొంత సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే బస్సుల్లో డబుల్ చార్జీలు వసూలు చేయడంపై కొంత విమర్శలు ఉన్నాయి. సాధారణంగా బస్సుల్లో సామాన్య ప్రజలు వెళుతూ ఉంటారు. వారికి డబుల్ చార్జీలు విధించి.. కారులో వెళ్లే వాళ్లకు టోల్ ఫీజులు రద్దు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే తెలంగాణ దసరాకు లేని ఈ నిర్ణయం ఆంధ్ర సంక్రాంతికి ఎందుకు అంటూ కొంతమంది మండిపడుతున్నారు. రోజుకి ఐదు కోట్ల చొప్పున మొత్తం 40 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రభుత్వం పై పడే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్