Saturday, September 19, 2026 12:05 PM
Saturday, September 19, 2026 12:05 PM

మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ఒంటరి అయ్యారా..?

ఏదైనా ఒక విషయంలో తప్పుడు ప్రచారం చేసే అంశాల్లో వైసిపి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటుంది. అధినేత నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఈ ప్రచారంలో ముందుంటారు. ఒక అంశంపై ఏకతాటి మీద నడవడంలో వైసిపి రాజకీయమే డిఫరెంట్ గా ఉంటుంది అనే మాట వాస్తవం. 2014 నుంచి 2019 వరకు ఇలాగే లేని ప్రచారాలు చేసి ప్రజల్లో టిడిపిని బలహీనపరచడంలో వైసీపీ అధిష్టానం సక్సెస్ అయింది. పింక్ డైమండ్, అమరావతి విషయం, జన్మభూమి కమిటీలు సహా అనేక అంశాల్లో ఇలాగే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే రాజకీయం వైసిపి చేస్తోంది.

Also Read : అర్నాబ్ తీరులో మార్పు ఎందుకు వచ్చింది..?

మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ రంగానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించే విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే విషయంలో టిడిపి ఫెయిల్ అవుతుంది. టిడిపి నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఎవరు కూడా సోషల్ మీడియాలో దీనిపై ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేయలేకపోతున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు రంగానికి ఇస్తే సీట్లు తగ్గుతాయని, వైద్యం ఖరీదు అయిపోతుంది అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. అటు జగన్ కూడా మెడికల్ కాలేజీ ల కోసం పెట్టుబడి పెట్టే వాళ్ళను తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

Also Read : మధ్యలో ఆయనెందుకు వచ్చాడు మీకు..!

పి పి పి విధానం అనేది చట్టబద్ధమైనప్పటికీ జగన్ చేస్తున్న హెచ్చరికలతో చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరోసా వెళుతున్న సరే చాలామంది వెనకడుగు వేస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయంలో టిడిపి సోషల్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో టిడిపి నాయకులు గానీ ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా మాట్లాడలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం లేదు. దీనిపై వైసీపీ చేసిన నిరసనలకు సోషల్ మీడియా ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. నాలుగు నెలల నుంచి వైసీపీ ఇదే రాజకీయం చేస్తోంది. దానిని టీడీపీ తక్కువ ఇచ్చిన వేయడం లేదంటే పట్టించుకోకపోవడం మినహా.. ప్రజల్లోకి వెళ్లే విధంగా వాస్తవాలు ప్రచారం చేయడంలో ఫెయిల్ అవుతుంది. ఇక కూటమిలోని రెండు పార్టీలు బిజెపి, జనసేన ఏ విధంగా కూడా దీనిపై రియాక్ట్ కావడం లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్