Wednesday, May 6, 2026 08:58 PM
Wednesday, May 6, 2026 08:58 PM

విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి ఎప్పుడంటే..!

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్క రాత్రిలోనే స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన కెరీర్‌కు దీర్ఘకాలిక విజయాలు అందించే చిత్రాలనే ఎంచుకుంటూ ఆచితూచి ముందడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా విజయ్ దేవరకొండ కమిట్ అయినట్లు సమాచారం.

Also Read : సినిమా రేటింగ్‌లో అక్రమాలు..!

ఇక ‘గీతా గోవిందం’ చిత్రంలో విజయ్ దేవరకొండ–రష్మిక మందాన జంటగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ సినిమా సమయంలో తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని ఇద్దరూ బహిరంగంగానే పలుమార్లు వెల్లడించారు. ఆ తరువాత వీరిద్దరూ తరచూ కలిసి కనిపించడం, ఒకరి గురించి ఒకరు సానుకూలంగా మాట్లాడడం వలన, వీరి మధ్య ప్రేమ సంబంధం ఉందన్న వార్తలు గతంలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో వీరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని, ఈ ఏడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం కూడా జరిగిందన్న వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి.

తాజాగా, ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుందంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ విషయంపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక మందాన గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై స్పష్టత లేదు. వీరు నిజంగానే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారా? లేక అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. అధికారికంగా ఎవరో ఒకరు స్పందిస్తే గానీ ఈ ఊహాగానాలకు తెరపడే అవకాశం కనిపించడం లేదు.

Also Read : రాజాసాబ్ ఫ్యాన్స్ కు వంగా న్యూ ఇయర్ గిఫ్ట్..??

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ–రష్మిక మందాన కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ జంటకు తెరపై మంచి స్పందన లభిస్తోందని, వీరి మధ్య కనిపించే కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడటం విశేషం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్