Sunday, September 20, 2026 03:43 AM
Sunday, September 20, 2026 03:43 AM

గ్రీన్ కార్డులపై ట్రంప్ సంచలన నిర్ణయం..!

అమెరికాలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆందోళనకు తగ్గట్టుగానే పరిణామాలు ఉంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ యువకుడి కాల్పుల ఘటన సహా పలు ఘటనలు ఇటీవల ఆందోళన కలిగించాయి. తాజాగా బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తీవ్ర సంచలనం అయింది. దీనితో ట్రంప్ వలసల విషయంలో మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేసారు.

Also Read : ఏపీలో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్యేలతో పవన్ అత్యవసర సమావేశం..!

ఈ ఘటనలో పోర్చుగీస్ జాతీయుడు క్లాడియో నెవెస్ వాలెంటే (48)ని నిందితుడిగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం అతను తన తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో.. అతని గురించి అధికారులు పలు కీలక విషయాలను వెల్లడించారు. 2017లో డైవర్సిటీ లాటరీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ (DV1) ద్వారా అతను అమెరికా వచ్చినట్టు గుర్తించారు. దీనితో ట్రంప్.. ఆ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read : ఢిల్లీలో బిజీ బిజీగా బాబు..!

ఇప్పటికే హెచ్ 1 బీ వీసాల విషయంలో, టూరిస్ట్ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఎవరో చేసిన పనికి ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతీ ఏటా ఈ లాటరీ ద్వారా.. ద్వారా 50,000 గ్రీన్ కార్డులను అమెరికాలో తక్కువగా ఉన్న దేశాల ప్రజలకు అందిస్తున్నారు. ఆఫ్రికా సహా పలు యూరప్ దేశాల పౌరులకు ఈ వీసాలు జారీ చేస్తున్నారు. 2025 వీసా లాటరీకి దాదాపు 20 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్