Thursday, May 7, 2026 07:25 AM
Thursday, May 7, 2026 07:25 AM

రగిలిపోతున్న బాలయ్య ఫ్యాన్స్.. సంక్రాంతికి యుద్దమేనా..?

సినిమా హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఒక హీరో సినిమాను మరో హీరో అభిమానులు ట్రోల్ చేయడం, ఆ సినిమాల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత గత 15 ఏళ్ళ దీని తీవ్రత పెరిగిన మాట నిజం. ముఖ్యంగా మన తెలుగులో ఈ ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నందమూరి వర్సెస్ మెగా అభిమానుల మధ్య వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అది పీక్స్ లో ఉంది.

Also Read : బ్రేకింగ్: టీడీపీలో పదవుల పండుగ

ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సీక్వెల్ విడుదలైంది. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమాలో బాలయ్య నటన, బోయపాటి డైరెక్షన్ సహా పలు అంశాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనితో బాలయ్య ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. సంక్రాంతికి చిరంజీవి సినిమా రిలీజ్ ఉన్న నేపధ్యంలో ఆ సినిమాను ఇప్పటి నుంచే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ అప్డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టార్గెట్ చేస్తున్నారు.

Also Read : రఘురామపై పీవీ సునీల్ సంచలన ట్వీట్..!

ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత తమ సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. వర ప్రసాద్ గారికి సంక్రాంతికి అసలు సినిమా కనపడుతుందని, ఈ సినిమా కోసం వెంకటేష్ ను బలి చేస్తున్నారు అంటూ హెచ్చరిస్తున్నారు. మీసాల పిల్ల అనే సాంగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. అనీల్ రావిపూడి కెరీర్ లో మొదటి ఫ్లాప్ ఈ సినిమానే అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆచార్య సినిమాతో కొరటాలను బలి చేసాడని, ఇప్పుడు అనీల్ రావిపూడి బలి కాబోతున్నాడని, సినిమా సక్సెస్ అయితే తమ క్రెడిట్.. ఫ్లాప్ అయితే డైరెక్టర్ తప్పుగా చిరంజీవి మాట్లాడతారని.. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు పోస్ట్ చేస్తూ ఆడేసుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్