Wednesday, May 6, 2026 11:51 PM
Wednesday, May 6, 2026 11:51 PM

కారు ఇంజిన్ లో కవిత మంటలు.. ఆ మాట ఎందుకు మాట్లాడినట్టు..?

తెలంగాణా రాజకీయాల్లో గత ఏడాది కాలంగా సంచలనాలు సృష్టిస్తున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. కవిత మీడియా ముందుకు వస్తున్నారంటే.. గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె నిర్వహించిన మీడియా సమావేశాల్లో.. గత కేసీఆర్ సర్కార్ ను నేరుగా కవిత టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, భూ కబ్జాలు, ఎమ్మెల్యేల వ్యవహారం సహా పలు అంశాలపై కవిత సంచలన కామెంట్స్ చేసారు.

Also Read : బ్రెస్ట్ క్యాన్సర్ టీకాలో సంచలన అడుగు..!

ముఖ్యంగా తనను పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టేలా చేసిన కొంత మంది కళ్లు ఇంకా చల్లబడలేదా అంటూ.. ఇంటి అల్లుడు ఫోన్ ను ట్యాప్ చేశారని, సిగ్గు లేదా అంటూ సంచలన కామెంట్స్ చేసారు. పదేళ్లపాటు తన భర్త పేరు ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదన్న ఆమె.. కానీ ఇప్పుడు మాత్రం అక్రమాలు చేశారని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన భర్తపై, నాపై ఇక నుంచి నిరాధార ఆరోపణలు చేస్తే కాళ్లు విరగ్గొడతా అంటూ హెచ్చరించారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా కామారెడ్డి జిల్లాకు చుక్క నీరు రాలేదని మండిపడ్డారు.

ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని విమర్శించారు. ఇక ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణా రావు సహా పలువురిపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కేటిఆర్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేయడంతో ఏం జరగబోతుందా అనే ఆందోళన అధిష్టానంలో మొదలైంది. గుంట నక్కలు ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో.. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపైనే ఆమె గురి పెట్టారనే ఆవేదన ఆ పార్టీ నేతల్లో మొదలైంది.

Also Read : పాలన అంటే ఇదే – 30 ఏళ్ల ఇఫ్కో SEZ సమస్యకు TDP ముగింపు

మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వాన్ని కాకుండా గులాబీ పార్టీపైనే ఆమె ఘాటు విమర్శలు చేయడంతో అటు బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్ధులు కూడా పండుగ చేసుకుంటున్నారు. కవిత భవిష్యత్తులో ఏ వ్యాఖ్యలు చేస్తారా అంటూ మీడియా వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇప్పటికే కవిత దెబ్బకు వణికిపోతున్న గులాబీ పార్టీ.. ఇంజిన్ లో మంటలు పెట్టడంతో.. ఈ సమస్యను కేసీఆర్ పరిష్కరించి, ఆమెను కంట్రోల్ చేయాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్