Wednesday, August 5, 2026 07:06 AM
Wednesday, August 5, 2026 07:06 AM

మెస్సి దెబ్బ.. హైదరాబాద్ పోలీసుల గుండెల్లో రైళ్లు

ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు మెస్సి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులకు ఆందోళన మొదలైంది. భారత్ లో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న మెస్సి.. నేడు ఉదయం కలకత్తాలోని సాల్ట్ లేక్ మైదానానికి వెళ్ళగా అక్కడ భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే వెళ్లిన కాసేపటికి మెస్సి మైదానం నుంచి వెళ్ళిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి తాము అక్కడికి వెళ్ళామని.. అలాంటిది మెస్సి కనీసం తమకు కనపడకుండా వెళ్ళిపోవడం ఏమిటి అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మైదానంలో, మైదానం వెలుపల ఆందోళన వాతావరణం నెలకొంది.

Also Read : భారత క్రికెట్ కు పట్టిన దరిద్రం గౌతమ్ గంభీర్

దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అభిమానులకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పారు. దీనిపై పశ్చిమబెంగాల్ గవర్నర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై కాసేపటి క్రితం తెలంగాణ డిజిపి మీడియా సమావేశం నిర్వహించారు. 7 గంటల 15 నిమిషాలకు మైదానంలోకి వస్తారని.. ఆఖరి ఐదు నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫుట్బాల్ ఆడతారని తెలిపారు. ఈ మ్యాచ్ తర్వాత చిన్నారులతో కాసేపు మెస్సి ఫుట్బాల్ ఆడతారని పేర్కొన్నారు.

Also Read : మెస్సి బస చేసే హోటల్ రూమ్ ధర తెలిస్తే..!

కోల్‌కతా సాల్ట్‌లేక్‌ స్టేడియంలో రసాభాస ఘటనతో రాచకొండ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉప్పల్‌ స్టేడియం దగ్గర అదనపు బలగాల మోహరించారు. అభిమానులు గ్రౌండ్‌లోకి రాకుండా పోలీసుల చర్యలు చేపట్టారు.మెస్సీ రాక దృష్ట్యా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. జడ్‌ కేటగిరీ భద్రతతో పాటు ప్రత్యేక బలగాల మోహరించారు. 20 వాహనాల కాన్వాయ్‌లో ఉప్పల్‌ స్టేడియానికి మెస్సీ వస్తున్నారు. దీనితో ఫలక్‌నుమా ప్యాలెస్‌ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ్యాచ్ అనంతరం మెస్సి ముంబై వెళ్తారు. దీనితో ముంబై విమానాశ్రయం వద్ద కూడా ఇప్పటికే భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్