Wednesday, February 4, 2026 09:20 PM
Wednesday, February 4, 2026 09:20 PM

పాలన అంటే ఇదే – 30 ఏళ్ల ఇఫ్కో SEZ సమస్యకు TDP ముగింపు

ఇఫ్కో కిసాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) ఏర్పాటుతో నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి నూతన శకం ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గత సుమారు 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇఫ్కో SEZ సమస్యను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించడం ద్వారా ఈ కీలక ప్రాజెక్టుకు మార్గం సుగమమైందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాచర్లపాడు గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఇఫ్కో కిసాన్ SEZకు గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించిన సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Also Read : బాలకృష్ణ పై ఎందుకీ ఏడుపు…? ఒక్కటైన మెగా ఫ్యాన్స్, వైసీపీ..?

ఈ ప్రాజెక్టు ద్వారా IFFCO Kisan SEZ Ltd సంస్థ నెల్లూరు జిల్లాలో మొత్తం 2,776 ఎకరాల విస్తీర్ణంలో మల్టీ–ప్రొడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను అభివృద్ధి చేయనుందని కలెక్టర్ తెలిపారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని భూసంబంధిత సమస్యలు తొలగిపోవడంతో ఇప్పుడు సుమారు 2,770 ఎకరాలు పరిశ్రమలకు భూకేటాయింపుల కోసం అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఈ SEZ అభివృద్ధికి మొత్తం రూ.870 కోట్ల పెట్టుబడితో అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ ప్రత్యేక ఆర్థిక మండలి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 30 వేల మందికి, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించి, మొత్తం మీద దాదాపు 70 వేల ఉద్యోగాలు సృష్టించబడతాయని కలెక్టర్ వివరించారు. అదనంగా మరిన్ని పరిశ్రమల యూనిట్లు స్థాపితమైతే మరో 29,400 మందికి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తోందని, ఇప్పటికే మూడు ప్రధాన సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నాయని తెలిపారు. మరికొంత మంది పారిశ్రామిక వేత్తలు కూడా పెట్టుబడుల కోసం ముందుకు వస్తున్నారని చెప్పారు.

Also Read : విశాఖ లో తండ్రి కొడుకుల దూకుడు.. ఐటీ కాపిటల్ గా సాగర నగరం..!

ఈ SEZ నెలకొనడం వల్ల MSME/SME పరిశ్రమలకు విస్తృత అవకాశాలు లభించడంతో పాటు, ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. దీని ద్వారా స్థానిక ప్రజలకు భారీ ఉపాధి, వ్యాపార అవకాశాలు, సమగ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతాయని అన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన అనంతరం కావలి–నెల్లూరు మధ్య ప్రాంతం కీలక ఆర్థిక కారిడార్‌గా మారి జిల్లాకు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చనుందని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్