Wednesday, February 4, 2026 02:21 PM
Wednesday, February 4, 2026 02:21 PM

విశాఖ లో తండ్రి కొడుకుల దూకుడు.. ఐటీ కాపిటల్ గా సాగర నగరం..!

2019 నుంచి 2024 వరకు ఏపీలో పెట్టుబడి అనే మాట వినపడేది కాదు. బొబ్బట్లు, పచ్చళ్ళు వంటివి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాయని ఓ ఐటీ మంత్రి సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ప్రకటన చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి.. వాతావరణం మారుతోంది. ఏపిలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రభుత్వ పెద్దల ముందు చూపుకి తోడు పరిపాలనలో దూకుడుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి దిశగా అడుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో పెట్టుబడులు ప్రవాహం కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో విశాఖ ఐటీకి రాజధానిగా మారుతోంది.

Also Read : లోకేష్ కమిట్మెంట్ కు షాక్ అయిన టీడీపీ నేతలు

తాజాగా విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్నీ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఋషి కొండ ఐటి పార్క్ లోని హిల్ టు పై మహతి పిన్ టెక్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ప్రారంభమైంది. ఇక ఈ సంస్థకు కాపులప్పాడ ఐటి హిల్స్ లో 21 ఎకరాలను సంస్థ కేటాయించారు. అందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐటి డిజిటల్ ట్రాన్స్ఫరేషన్ ఐటీ క్యాంపస్ ను సంస్థ మూడు దశల్లో 1583 కోట్లతో నిర్మించనుంది కాగ్నిజెంట్. దీని ద్వారా దాదాపు 8,000 మందికి ఉపాధి లభిస్తుంది. 2029 నాటికి మొదటి దశ పూర్తి అయితే.. 3000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తుండగా.. 2033 నాటికి మూడు దశలను సంస్థ పూర్తి చేయనుంది.

Google MOU with AP Govt

కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు. విశాఖ కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముందు 8 వేలమందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్న కాగ్నిజెంట్, శంకుస్థాపన వేదికగా సీఎం చంద్రబాబు సమక్షంలో ఉద్యోగాలు 25 వేలు కల్పిస్తామని సీఈఓ రవికుమార్ ప్రకటించారు. జనవరి 23న దావోస్ లో కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.. జూన్ 25న విశాఖలో పెట్టుబడి పెడుతున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. దాని ప్రకారం నేడు విశాఖలో కార్యాకలాపాలు మొదలయ్యాయి. కాగ్నిజెంట్ కు సిఎం చంద్రబాబు కాపులప్పాడ ఐటీ హిల్స్ లో భూమి పూజి చేసారు.

Also Read : అఖండ 2 మూవీ రివ్యూ : నిజంగా అఖండ తాండవమే

సత్వాతో పాటుగా మరో ఏడు సంస్థలకు లోకేష్ భూమి పూజ చేస్తారు. టెక్ తమ్మిన, నాన్ రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వంటి సంస్థలకు శంకుస్థాపన చేసి.. శిలా ఫలకాలను లోకేష్ ఆవిష్కరిస్తారు. అటు కాపులుప్పాడ ఐటీ హిల్స్‌ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సిఎం చంద్రబాబు విజన్ కి తోడు.. యువకుడు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో విశాఖ రాష్ట్ర ఆర్ధిక రాజధానిగా అవతరించి దేశానికీ మరో మణిహారంగా నిలవనుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Nara Lokesh inaugurates Cognizant

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్