బోరుగడ్డ అనీల్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత అయిదేళ్లుగా ఎక్కువగా వినపడుతోన్న పేరు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత ప్రీతిపాత్రుడు అనే గుర్తింపు తెచ్చుకున్న నాయకుల్లో ఒకరు. ప్రస్తుతం రాజకీయంగా ఆ పార్టీ బలహీనంగా ఉండటం, గతంలో అనీల్ చేసిన వ్యాఖ్యల పర్యవసానాలు ఇప్పుడు ఆయనను సైలెంట్ గా ఉంచుతున్నాయి. దాదాపు 250 రోజుల పాటు జైల్లో గడిపిన బోరుగడ్డ అనీల్ కుమార్ ఇప్పుడు బెయిల్ పై విడుదలై బయట ఉన్నారు. గతంలో మాదిరిగా స్పీడ్ లేకపోయినా.. వాయిస్ లో బేస్ మాత్రం అలాగే ఉందనే విషయం తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో స్పష్టత వచ్చింది. అది అలా ఉంచితే.. ఇప్పుడు ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం అవుతున్నాయి.
Also Read : సీనియర్ దూకుడుకు తెలుగు తమ్ముళ్ల బ్రేకులు
అసలు బోరుగడ్డ అనీల్ ఏం మాట్లాడారో ఒకసారి చూస్తే.. తన వెనుక వైఎస్ జగన్ ఉన్నారని, జగన్ కు తాను అత్యంత ప్రియా శిష్యుడు అంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో మరో ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు. తనను బయటకు తీసుకు రావాలంటే.. జగన్ వల్లనే సాధ్యమైందని, జగన్ కు బెయిల్ తెచ్చిన లాయర్ల బృందమే తన కోసం ప్రయత్నం చేసిందని, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరి కోసమే పని చేశారని, ఒకరు ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు కాగా మరొకరు బోరుగడ్డ అనీల్ అంటూ చెప్పుకున్నారు. ఈ కామెంట్స్ విన్న వైసీపీ నేతలతో పాటుగా ఇతర పార్టీల నాయకులు కూడా షాక్ అయిన పరిస్థితి ఉంది.
Also Read : రూటు మార్చేసిన అన్న.. మీడియా ముందుకు వాళ్ళే..!
దీనితో ఒక్కసారిగా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ఆయనకు, వైసీపీకి ఏ సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అది బాగానే ఉంది గానీ.. ఇప్పటి వరకు అతన్ని మాట్లాడించింది, తిట్టించింది వైసీపీ పెద్దలే అనే అనుమానాలకు బోరుగడ్డ ఒక్క దెబ్బకు క్లారిటీ ఇచ్చేసారు. వేరే పార్టీలో ఉంటూ జగన్ అభిమానిగా ఆయన తిట్టిన ప్రతీ తిట్టు వెనుకా జగన్ సపోర్ట్ ఉందనే క్లారిటీ జనాలకు ఇచ్చారనే కామెంట్స్ వినపడుతున్నాయి. మరి బోరుగడ్డ ఆ కామెంట్ ఎందుకు చేసాడనేది తెలియకపోయినా.. తనకు వైసీపీ అండగా నిలబడలేదు అనే కోపంతోనే వ్యూహాత్మకంగా బోరుగడ్డ ఈ కామెంట్స్ చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. మరి దీనిపై వైసీపీ అధికార ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి.

