Sunday, March 22, 2026 04:11 AM
Sunday, March 22, 2026 04:11 AM

సీనియర్ దూకుడుకు తెలుగు తమ్ముళ్ల బ్రేకులు

ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు.. కాంగ్రెస్ వ్యతిరేక వాదిగా ఆయనకు పేరుంది. రైతు నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మాజీ ప్రధాని, దివంగత చౌదరి చరణ్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడని పేరు. అలాంటి నాయకుడు, ఈ మధ్యకాలంలో, వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారట.. వారు ఇచ్చిన చంద్రబాబు వ్యతిరేక స్క్రిప్ట్ చదువుతున్నారట కూడా. అసలు ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు.. ఎందుకు అలా చేస్తున్నారు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్.

ఇక అసలు విషయానికొస్తే.. రెండు దఫాలు ఎంపీగా ఓడిపోయిన వడ్డే శోభనాద్రీశ్వరరావు.. ఎమ్మెల్యే గా పోటీచేసే అవకాశం ఇచ్చి, గెలిచిన తర్వాత ఐదేళ్లు మంత్రి పదవిచ్చారు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు పట్ల కృతజ్ఞత చూపించాల్సిన వడ్డే.. ఇప్పుడు.. 80 ఏళ్ల వయసులో పరోక్షంగా వైసీపీకి మేలు చేసే విధంగా.. కూటమి ప్రభుత్వం పై విమర్శలు, ఆరోపణలు చేస్తూ, శునకానందం పొందుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Also Read : ఆ యంగ్ స్పీడ్ గన్ ఎక్కడ..? గంభీర్ మర్చిపోయాడా..?

దాదాపు 20 ఏళ్లుగా రాజకీయ నిరుద్యోగిగా ఉంటున్న, వడ్డే శోభనాద్రీశ్వరరావు.. ఇటీవల కాలంలో, చంద్రబాబు పై రెచ్చిపోతూ, వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. రాజకీయ నిరుద్యోగిగా వున్న వడ్డే.. ఏ పదవిస్తామని, జగన్ రెడ్డి ఆశ చూపారో.. అంటూ విమర్శలు చేస్తున్నారు. అందుకే ఇష్టారాజ్యంగా, సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి వడ్డే చేస్తున్న విమర్శలు, ఆరోపణలను.. అటు సీఎం చంద్రబాబు కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కానీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ఈ వయసులో ఏదేదో అంటూ ఉంటారు… ఆయన గురించి మాట్లాడటం “టైం వేస్ట్ “అని అనుకుంటున్నారు కూడా. కాంగ్రెస్ వ్యతిరేకిగా రాజకీయాల్లోకి వచ్చి, 1978లో ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 1983లో దివంగత ఎన్టీఆర్ పై విమర్శలు చేసి, ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 1984లో విజయవాడ టీడీపీ ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. మళ్ళీ 1991లో జరిగిన మధ్యంతర లోకసభ ఎన్నికల్లో ఎంపీ గా విజయం సాధించినా, 1996,1998 ఎన్నికల్లో ఓడిపోయారు. వరుసగా రెండు సార్లు ఓడిన వడ్డేకు 1999లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు.

Also Read : టీడీపీతో అర్నబ్ మైండ్ గేమ్..? ఉచ్చులో పడ్డారా..?

ఐదేళ్లు పాటు చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగారు కూడా. వడ్డే రాజకీయ సీనియారిటీకి చంద్రబాబు విలువ ఇచ్చారనేది తెలుగు తమ్ముళ్ల మాట. అయినా చేసిన మేలు మరిచి, వైసీపీ నేతలు ఇస్తున్న స్క్రిప్ట్ చదువుతున్నారని.. వడ్ దూకుడుకు బ్రేకులు వేయకపోతే.. ఆయన మరింత రెచ్చిపోతారని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. వడ్డే వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్