Sunday, September 20, 2026 04:16 AM
Sunday, September 20, 2026 04:16 AM

ఫైల్స్ క్రియేట్ చేయొద్దు.. చంద్రబాబు సంచలన కామెంట్స్

ప్రభుత్వ పరిపాలన సహా పలు అంశాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టిన ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.. ఇటీవలి కాలంలో చేస్తోన్న వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా చంద్రబాబు.. సచివాలయంలో ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 నెలల పాలన సహా పలు కీలక అంశాల గురించి చర్చించారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటుగా, సచివాలయంలో ఫైల్స్ క్లియర్ చేసే అంశం సహా పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి.

Also Read : పేడ పురుగులతో జాగ్రత్త.. ఏపీ సర్కార్ వార్నింగ్

ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందన్న సిఎం.. ప్రజలు మెచ్చే పాలన అందివ్వాలని, ఫైళ్లు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించారు. ఇకపై డేటా లేక్‌లో ఉన్న సమాచారంతో సుపరిపాలన అందివ్వాలని, నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఏపీ అడుగులు వేస్తోందన్నారు. అందుకే, పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. విశాఖలో 1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందని తెలిపిన సిఎం.. ప్రధాని మోదీని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కలిసి ఇండియాలో రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్దమని చెప్పారని వివరించారు.

Also Read : లోకేష్ పేరు వాడితే అంతే.. టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్..?

ఈ సందర్భంగా మరికొన్ని వ్యాఖ్యలు చేసారు. రాజ్యాంగాన్నే సవరించారని, బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి అని నిలదీశారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదు.. అనవసర ఫైళ్లు సృష్టించే విధానం పోవాలని చురకలు అంటించారు. 18 నెలల పాలనపై సమీక్షించుకుందామని, భవిష్యత్‌పై లక్ష్యాలు పెట్టుకుందామని దిశా నిర్దేశం చేసారు. ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వాఫీసులకు ఎందుకు రావాలి?… ఇళ్ల వద్దకే సేవలు చేరే పరిస్థితి రావాలని స్పష్టం చేసారు. గత ప్రభుత్వం అవలంభించిన విధానాలతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూల్స్ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆగిపోయిన కేంద్ర పథకాలను తిరిగి పునరుద్దరించామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్