Wednesday, February 4, 2026 04:21 PM
Wednesday, February 4, 2026 04:21 PM

అల్లు అర్జున్ అలా చేశారన్న దిల్ రాజు..!

అల్లు అర్జున్ చేసిన పనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివరించారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్ తల్లి మృతి చెందారు. తొక్కిసలాట ఘటనకు ఏడాది గడిచింది. ఇప్పటికీ శ్రీతేజ్ పరిస్థితి దయనీయంగానే ఉంది. ఒంటినిండా ట్యూబులతో చలనం లేకుండా ఉన్నాడని తండ్రి వెల్లడించారు. ప్రతిరోజూ థెరపీలు చేయిస్తున్నారు. ప్రతి నెలా లక్షన్నర వరకు ఖర్చు అవుతుందని.. చికిత్స ఖర్చులకు ఫిక్సిడ్ డిపాజిట్ డబ్బులు ఏ మాత్రం సరిపోవడం లేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్త పెద్ద దుమారం రేపింది. చివరికి అల్లు అర్జున్ శ్రీతేజ్‌ కుటుంబానికి ఇచ్చిన హామీ మర్చిపోయారని.. చేస్తానన్న సాయం కూడా అల్లు అర్జున్‌కు గుర్తు లేదని పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : చంద్రబాబు ఎందుకు ఈజీ టార్గెట్ అవుతున్నారు?

గతేడాది పుష్ప 2 సినిమా విడుదలకు ముందు రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేశారు. అయితే ఆ షో సమయంలో అభిమానుల తొక్కిసలాట చోటు చేసుకుంది. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడే ఉన్నారు. అభిమానుల కోసం ఓపెన్ టాప్ జీప్‌లో పై కెక్కి అభివాదం చేశారు. అయితే తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. శ్రీతేజ్ అనే పదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అల్లు అర్జున్‌ పైన, సంధ్య థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేయగా చంచల్ గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఒక రాత్రంతా గడిపారు. ఆ తర్వాత బెయిల్‌ పైన విడుదలయ్యారు. అయితే శ్రీతేజ్ విషయంపై బన్నీపై విమర్శలు వెల్లువెత్తడంతో.. అల్లు అరవింద్ రంగంలోకి దిగారు. స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read : జగన్ రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. టీడీపీ వార్నింగ్..!

అయితే రెండు రోజులుగా ఒక వార్త పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఇచ్చిన హామీ అల్లు అర్జున్ మర్చిపోయారని.. శ్రీతేజ్ కుటుంబం పరిస్థితి దయనీయంగా ఉందనే వార్త పెద్ద దుమారం రేపింది. దీనిపై నిజానిజాలు పరిశీలించకుండా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై ఎఫ్‌డీసీ దిల్ రాజు వివరణ ఇచ్చారు. శ్రీతేజ్ పేరుతో అల్లు అర్జున్ రూ.2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని.. దాని పైన వచ్చే వడ్డీ కూడా వారికి వచ్చేలా చేశారన్నారు. అలాగే శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చులు దాదాపు 70 లక్షలు పైగా అన్నీ అల్లు అర్జున్ చెల్లించారన్నారు. అలాగే రిహాబిటేషన్ కోసం అయ్యే ఖర్చు కూడా అల్లు అర్జున్ భరిస్తామని చెప్పారన్నారు. శ్రీతేజ్‌కు అయ్యే ఖర్చు మొత్తం కూడా అల్లు కుటుంబం భరిస్తుందని దిల్ రాజు హామీ ఇచ్చారు. ఇంత ఖర్చు చేసిన వాళ్లు.. మిగిలినవి కూడా చేస్తారని దిల్ రాజు వెల్లడించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్