Saturday, September 19, 2026 10:19 PM
Saturday, September 19, 2026 10:19 PM

చంద్రబాబు ఎందుకు ఈజీ టార్గెట్ అవుతున్నారు?

తెలుగు రాజకీయాలలో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కీలక నాయకుడిగా నిలిచారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, పరిపాలనా నైపుణ్యం, అభివృద్ధి ఆధారిత రాజకీయాలు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. అయితే గత కొంతకాలంగా ఆయన నిర్ణయాలు, వ్యాఖ్యలు, రాజకీయ పునరాగమనంపై ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా, కొంతమంది సామాజిక వర్గాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ఆయన జనాదరణ తగ్గిందని కాదు; రాజకీయంగా ఆయన ప్రభావం ఇంకా బలంగానే ఉండటం వల్లే లక్ష్యంగా మారుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం.

Also Read : జగన్ రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. టీడీపీ వార్నింగ్..!

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చంద్రబాబు నాయుడు తీసుకునే ఏ నిర్ణయం అయినా సోషల్ మీడియా నుండి ప్రత్యర్థి పార్టీల వరకు చురుకైన ప్రతిస్పందనలకు దారితీస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఆయనను కౌంటర్ చేయడం ద్వారా రాజకీయ మైలేజ్ పొందాలనే వ్యూహం. శాసనసభలోనూ, సభ వెలుపల కూడా ఆయనపై విమర్శలు చేయడం ద్వారా తమ కేడర్‌ను ఉత్తేజపరచవచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. పైగా, గతంలో ఉన్న కేసులు, రాజకీయ దాడులు, అరెస్టు వంటి సంఘటనలు ఆయనను టార్గెట్ చేయడం కోసం సులభమైన అంశాలుగా మారాయి.

Also Read : అఖండ 2 ప్రీమియర్స్ రద్దు : కారణం అదేనా..?

మరోవైపు, సీఎం స్థానంలో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల ప్రభావం ఇప్పటికీ ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసే ప్రతి అడుగు రాజకీయ పోరాటాల్లో ఒక “నేరేటివ్”గా ఉపయోగించబడుతోంది. ముఖ్యంగా, అభివృద్ధి, వ్యవస్థాపకత, పెట్టుబడులపై ఆయన దృష్టి వలన, ఆయనను సమర్థించేవారి సంఖ్య ఎక్కువ. కాబట్టి ఆయనను టార్గెట్ చేయడం అంటే ప్రజల్లో పెద్ద చర్చను సృష్టించడం కావడంతో, ఈరోజుల్లో చంద్రబాబు సులభమైన లక్ష్యంగా మారుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Also Read : జగన్ గుండెల్లో అమరావతి రైళ్లు.. షాక్ ఇవ్వనున్న కేంద్రం..!

ఇప్పుడైతే చంద్రబాబు మరోసారి ఒక స్పష్టమైన విజన్‌తో పనిచేస్తున్నారు. కానీ ఆయన ఏం చేసినా—పెట్టుబడులు తెస్తే ఒకే ప్రాంతానికే తెచ్చారు అంటారు, తెచ్చకపోతే పనేమీ చేయలేదంటారు. పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే “షో ఆఫ్” అంటారు, నిర్వహించకపోతే “ప్రయత్నం చేయలేదని” విమర్శిస్తారు. ఆయన వయసు కంటే, శక్తి కంటే ఎక్కువగా పని చేస్తుంటే… ప్రతి అడుగులోనూ లోపాలు వెతకడం, కనపడని చోట కూడా వంకరలు పెట్టడం ప్రారంభమైంది. దీనికి తోడు టీడీపీతో సంబంధం ఉన్న కొంతమంది కుహానా మేధావులు కూడా అదే స్వరంలో మాట్లాడితే… అది నాయకుడికే కాదు, పార్టీ భవిష్యత్తుకే భారీ నష్టం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్