తెలుగు ప్రజల మధ్య మరోసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. వారం రోజుల వ్యవధిలో వరుసగా రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. వీటిల్లో ఒకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. మరొకటి గాన గంధర్వుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదం. కోనసీమకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందేమో అని పవన్ అనటంపై తప్పుబడుతున్న తెలంగాణ వాదులు.. దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేశారు. తెలంగాణలో పవన్ సినిమాలు ఆడేందుకు అనుమతి కూడా ఉండదని బెదిరించారు. ఇక సీపీఐ నారాయణ వంటి మహా మేథావులు అయితే.. పవన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని కొత్త మాటలు చెబుతున్నారు.
Also Read : చలికాలం లెన్స్ వాడుతున్నారా..? అయితే ఇవి మిస్ కావొద్దు..!
ఇక మరో ఘటన ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు అంశం. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వద్ద ఎస్బీబీ విగ్రహాన్ని ఆయన బంధువులు, అభిమానులు సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. అప్పుడు కనీసం నోరెత్తని తెలంగాణ వాదులంటూ చెబుతున్న వ్యక్తులు.. విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పుడు మాత్రం అక్కడికి వచ్చి హంగామా చేస్తున్నారు. ఎస్బీ బాలు ఆంధ్రకు చెందిన వ్యక్తి అని.. కాబట్టి ఆంధ్రలోనే విగ్రహం పెట్టుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. అసలు కళకు ప్రాంతాలతో పనేంటి. అలా అంటే ఎస్బీ బాలు తొలిసారి పాట పాడింది నాటి మద్రాసులో. దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో కూడా బాలుకు అభిమానులున్నారు. నిజానికి కోవిడ్ మహమ్మారి బలి తీసుకోకపోయి ఉంటే.. బాలు ఇప్పటికీ తన పాటలతో మన మధ్యే ఉండేవారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. బాలు ఇదే హైదరాబాద్‌లో నివసించారు. ఇదే హైదరాబాద్‌లో కొన్ని వందల షోలు ఇచ్చారు. అదే హైదరాబాద్‌లో ఇప్పటికీ నిర్వహిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇప్పటికే బాలు కుటుంబ సభ్యులు అదే హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఏటా లక్షల్లో పన్నులు చెల్లిస్తున్నారు కూడా. బాలునే కాదు.. ఎంతోమంది ఇతర ప్రాంతాలకు చెందిన వారు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో చాలా చోట్ల సెటిలయ్యారు. వాళ్లు కూడా తెలంగాణ అభివృద్ధిలో తమ వంతు భాగమవుతున్నారు. కానీ ఇవేవీ ఆ తెలంగాణ వాదులకు తెలియదు. కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మాత్రమే తెలుసు.
Also Read : గంభీర్ ఎక్కడ..? ఓ ఆట ఆడుకుంటున్న కోహ్లీ ఫ్యాన్స్
నిజానికి ఈ ప్రాంతీయ విద్వేషాల వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రేవంత్ శిష్యుడని.. అందుకే టీడీపీ శ్రేణులు కూడా సీఎం రేవంత్‌కు అన్ని విధాలుగా అండగా ఉందనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోనే చాలా మందికి ఉంది. ఇక మరికొంతమంది అయితే రేవంత్ రెడ్డిపై కాస్త గుర్రుగా ఉన్నారు. తమ కంటే వెనుక పార్టీలోకి వచ్చిన రేవంత్.. తమను ఓవర్ టేక్ చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారని.. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని తమ సన్నిహితుల దగ్గర ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ను తప్పించాలంటే.. అది అసాధ్యమని.. కాబట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వల్లే సాధ్యమనే కుట్రతో ఇలా చిన్న చిన్న విషయాలను కూడా రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తెలంగాణలో విగ్రహాల ఏర్పాటు ఇప్పుడు కొత్తేం కాదు. మధ్యప్రదేశ్‌కు చెందిన బాబా సాహెబ్ అంబేద్కర్‌కు తెలంగాణలో సచివాలయం దగ్గరే వంద అడుగుల విగ్రహం పెట్టారు. ఎందుకనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటే.. ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. అందుకే అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు అంతా సహకరించారు. అప్పుడు ఎలాంటి ప్రాంతీయ సమస్యలు రాలేదు. కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాం విషయంలో మాత్రం ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే.. ఎస్పీబీ పేరు చెబితే ఓట్లు రావని అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు రేవంత్ వ్యతిరేక వర్గం ఇదే విషయాన్ని రచ్చ చేస్తోంది.
Also Read : నెల్లూరు పోలీసుల సెన్సేషన్.. రౌడీల గుండెల్లో రైళ్ళు..!
పదేళ్ల క్రితమే తెలంగాణ సమస్య ముగిసిపోయింది. కానీ ఇప్పటికీ ఆ పేరుతో కొందరు రాజకీయం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు కూడా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆంధ్ర, తెలంగాణ అంటూ విభేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్‌రావు పట్ల సీఎం రేవంత్ రెడ్డి కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని వెలికితీస్తున్నారు. దీంతో ఎప్పుడైనా అరెస్టు ఖాయమనే మాట వినిపిస్తోంది. అందుకే రేవంత్‌ను తప్పించాలనేది బీఆర్ఎస్ నేతల ప్లాన్ కూడా. ఇందుకు కాంగ్రెస్‌లోని రేవంత్ వ్యతిరేక వర్గం సహకరిస్తోంది. తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి.. అది రేవంత్ వైఫల్యం కింద చూపించాలనే కుట్ర వేస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. మొత్తాన్ని ఎస్బీ బాలు విగ్రహం ఏర్పాటు, పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఓ వర్గం నేతలకు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు అయ్యింది.

