Monday, May 18, 2026 04:12 AM
Monday, May 18, 2026 04:12 AM

ఈరోజు (04-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం 04-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 04-12-2025

శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువర్గంతో చిన్న పాటి వివాదాలు తప్పవు. వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

—————————————

వృషభం 04-12-2025

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది.

—————————————

మిధునం 04-12-2025

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. చేతిలో డబ్బు నిలువ ఉండక నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

—————————————

కర్కాటకం 04-12-2025

వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.

—————————————

సింహం 04-12-2025

మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

—————————————

కన్య 04-12-2025

వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహయత్నాలు సానుకూలమౌతాయి. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

—————————————

తుల 04-12-2025

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటాబయట మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

—————————————

వృశ్చికం 04-12-2025

భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

—————————————

ధనస్సు 04-12-2025

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

—————————————

మకరం 04-12-2025

వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.

—————————————

కుంభం 04-12-2025

ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరులతో కలహా సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

—————————————

మీనం 04-12-2025

ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి. వ్యాపారాలు అంతంతా మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. స్థిరస్తి కొనుగోలులో ఆటంకాలు ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

————————————-

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాడు రాళ్ళ సీమ.....

రాయలసీమ ప్రాంతాన్ని నిజమైన రతనాల సీమగా...

అన్నకు కౌంటర్‌గా షర్మిల...

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పాదయాత్రకు...

భూమన ఫ్యామిలీకి షాక్.....

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే...

రఘురామ వర్సెస్ కొలికపూడి...

గత కొన్నాళ్ళుగా తిరువూరు నియోజకవర్గం ఏపీ...

నేడే బండి భగీరథ్...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

పవన్ అడ్డా అదేనా.....

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాతుకు...

పోల్స్