Saturday, September 19, 2026 11:21 PM
Saturday, September 19, 2026 11:21 PM

నారా భువనేశ్వరి : స్త్రీ శక్తికి ఫ్రీ ప్రమోషన్…!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో విశేష స్పందన పొందుతున్నాయి. ముఖ్యంగా మహిళల ప్రయాణ భద్రతను, స్వేచ్ఛను పెంచేందుకుగా రూపొందించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మహిళలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తోంది. ఈ పథకం ప్రభావం ఎంతగా వ్యాపించిందో చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద‍్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో చేరడం విశేషం. కుప్పం పర్యటనలో భాగంగా, తుమ్మిసి పెద్ద చెరువులో జరుగిన జలహారతి కార్యక్రమానికి హాజరవ్వడానికి, ఆమె శాంతిపురం నుండి తుమ్మిసి వరకు సాధారణ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేశారు.

Also Read : భూమనను అడిగిన ప్రశ్నలు ఇవే..?

భువనేశ్వరి తన వద్ద ఉన్న ఆధార్ కార్డు చూపించి, ఇతర మహిళల మాదిరిగానే స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ టికెట్ పొందారు. దీనితో ఈ పథకం మీద ప్రజల్లో మరింత నమ్మకం, ఆసక్తి పెరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె ఇతర మహిళలతో మాట్లాడి, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలు, ప్రయాణ అనుభవాలు తెలుసుకున్నారు. తమతోపాటు ముఖ్యమంత్రి సతీమణి సాదాసీదా ప్రయాణికురాలిగా బస్సులో ఉండటాన్ని చూసి, మహిళలు మాత్రమే కాదు, ఇతర ప్రయాణికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. భువనేశ్వరి తీసుకున్న ఫ్రీ టికెట్ ఫోటోలు, బస్సులో ప్రయాణించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Also Read : ఆ జిల్లా సంగతి నేను చూస్తా.. చంద్రబాబు కీలక కామెంట్స్

గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు ఎక్కువగా రాకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సాధారణ వాలంటీర్‌లా ప్రజల گھర్లకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా వింటూ కొత్త శైలిలో పాలనను నడుపుతున్నారు. అదే విధంగా, భువనేశ్వరి కూడా ఒక సాధారణ మహిళలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, మహిళలకు దక్కుతున్న సంక్షేమ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, ప్రయాణికులతో మాట్లాడి పథకాల సార్థకతను అర్థం చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లే విధానం మరింత పారదర్శకంగా మారినట్లుగా భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్