Saturday, September 19, 2026 10:35 PM
Saturday, September 19, 2026 10:35 PM

ఓటమిపై గంభీర్ సంచలన కామెంట్స్.. నిర్ణయం బోర్డుదే..!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేసే సమయం ఆసన్నమైందా..? జట్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిందేనా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత ఏడాది టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాతి నుంచి భారత్ క్రమంగా పతనం అవుతూ వస్తోంది. కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి జట్టు ఆట తీరు రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. న్యూజిలాండ్ తో వైట్ వాష్ ఓ సంచలనం అయితే.. ఆస్ట్రేలియా సీరీస్ లో గెలవాల్సిన మ్యాచ్ లు ఓడిపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also Read : గౌహతీ టెస్ట్ ను టీమిండియా డ్రాతో ముగిస్తుందని భావిస్తున్నారా?

ఇక ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సత్తా చాటినా.. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా గెలవాల్సిన మ్యాచ్ లను చేజార్చుకుంది. ఇక ఆసియా కప్ లో భారత్ విజేతగా నిలిచింది. కానీ ఆస్ట్రేలియాలో వన్డే సీరీస్ ను 2-1 తేడాతో కోల్పోయింది. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో వైట్ వాష్ ఎదుర్కొంది. దీనితో హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ లను లక్ష్యంగా చేసుకుని క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గౌహతి టెస్ట్ అనంతరం గౌతం గంభీర్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

తాను కోచ్ గా ఉండేందుకు అర్హుడినా కాదా అనే దానిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలని కామెంట్ చేసాడు. తాను ఇంతకు ముందు కూడా చెప్పాను, భారత క్రికెట్ ముఖ్యం, నేను ముఖ్యం కాదు. ఇంగ్లాండ్‌ లో మెరుగైన ఫలితాలు సాధించడం, ఛాంపియన్స్ ట్రోఫీని, ఆసియా కప్‌ ను గెలిచిన జట్టులో తాను భాగస్వామిని అంటూ కామెంట్ చేసాడు. భారత జట్టులోని ప్రతి ఒక్కరూ 0-2 సిరీస్ ఓటమికి బాధ్యత వహించాలని, కానీ ఆ నింద అతనితోనే మొదలవుతుందని పేర్కొన్నాడు.

Also Read : నేనేంటో త్వరలో చూస్తారు.. ఆ జిల్లా నేతలకు చంద్రబాబు వార్నింగ్..!

కాగా గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత్ 18 టెస్ట్‌ లలో 10 ఓడిపోయింది. జట్టులో తరచుగా మార్పులు చేయడం, సాంప్రదాయ ఫార్మాట్‌లో స్పెషలిస్టుల కంటే ఆల్ రౌండర్లపై ఎక్కువ దృష్టి పెట్టడంతో గంభీర్ టార్గెట్ గా క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఈ ఓటమికి ఏ ఒక్క ఆటగాడిని తాను నిందించాలి అనుకోవడం లేదని, టెస్ట్ క్రికెట్ ను యువ ఆటగాళ్ళు అర్ధం చేసుకోవాలన్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్