Saturday, September 19, 2026 11:21 PM
Saturday, September 19, 2026 11:21 PM

నేనేంటో త్వరలో చూస్తారు.. ఆ జిల్లా నేతలకు చంద్రబాబు వార్నింగ్..!

గత కొన్నాళ్ళుగా కృష్ణా జిల్లా నేతలు వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ ఎంపీ ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదం పార్టీ పరువు తీస్తున్న నేపథ్యంలో, పలుమార్లు చంద్రబాబు నాయుడు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రాకపోవడం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీని పట్టించుకోవడం లేదని, ప్రజలలో ఉండటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.

Also Read : ఆ జిల్లా సంగతి నేను చూస్తా.. చంద్రబాబు కీలక కామెంట్స్

రాజకీయంగా ఇది వైసీపీకి బలం చేకూర్చే అంశమని, అధిష్టానం ఆవేదన వ్యక్తం చేస్తున్నా సరే.. నేతల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. చాలామంది ఎమ్మెల్యేలు కూటమి పార్టీల నాయకులతో కలిసి పనిచేయడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లా పరిధిలోని మూడు పార్లమెంట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు కృష్ణా, జిల్లా నేతల వ్యవహార శైలి పై క్యాబినెట్ సబ్ కమిటీలో, ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

Also Read : హైదరాబాద్ లో ప్రభాస్ ఇల్లు గురించి తెలిస్తే..

ఉమ్మడి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అనే అభిప్రాయాలు వినపడిన నేపథ్యంలో, చంద్రబాబు ఆసక్తికర కామెంట్ చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యవహారం తాను చూసుకుంటానని, నాయకుల వ్యవహార శైలిని కూడా గాడిలో పెట్టే బాధ్యత తనదని, ఎమ్మెల్యేలు ఇదేవిధంగా ఉంటే పరిస్థితి మరోరకంగా ఉంటుందని చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని, తాను చెప్పినా సరే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారట. కూటమిలో ఎమ్మెల్యేలు చీలిక కూడా తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. తాను ఏంటో త్వరలోనే చూస్తారని, పార్టీని, ప్రజలను విస్మరించే వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ఇస్తామని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్