Saturday, September 19, 2026 11:21 PM
Saturday, September 19, 2026 11:21 PM

హైదరాబాద్ లో ప్రభాస్ ఇల్లు గురించి తెలిస్తే..

టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ పర్సనల్ లైఫ్ లగ్జరీగా ఉంటుందనే విషయం అందరికీ క్లారిటీ ఉంటుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అప్పటి నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా హిట్ లు కొడుతూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్ తో పాటు 4 సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్న ఈ భీమవరం రాజు గారి.. హైదరాబాద్ ఇల్లు గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమే.

Also Read : స్మృతి మందాన పెళ్లి క్యాన్సిల్..?

హైదరాబాద్‌ లోని జూబ్లీ హిల్స్‌లో లో ఉండే అతని శాశ్వత నివాసంలో ఇల్లు ఖరీదు రూ. 60 కోట్లు పైమాటే. విలాస వంతంగా ఉండే ఈ ఇంటిని ప్రభాస్ తనకు నచ్చిన విధంగా.. అద్భుతమైన ఇంటీరియర్ తో డిజైన్ చేయించుకున్నాడు. ఇది హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన సెలబ్రిటీ ఇళ్లలో ఒకటిగా చెప్తూ ఉంటారు. ఈ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ సౌకర్యం కూడా ఉంది. రూ. 1.5 కోట్ల విలువైన అత్యాధునిక జిమ్ వంటి అల్ట్రా లగ్జరీ వంటి ఫీచర్స్ తో ఇంటిని డిజైన్ చేసుకున్నాడు. విదేశీ నిపుణులు ఈ ఇంటి కోసం పని చేసారు.

Also Read : మద్యం కేసులో పీకల్లోతు ఇరుకున్న పెద్దన్న..!

లివింగ్ రూమ్ ప్రాంతంలో అత్యాధునిక ఫర్నిచర్ కూడా ఉంది. భారీ టీవీ స్క్రీన్, అతని ప్రత్యేక జ్ఞాపకాలను ప్రదర్శించే ఫోటోలతో నిండిన ఓ రూమ్ లో గోడ కూడా ఉంది. రాజుల కాలం నాటి డిజైన్ లతో ఈ ఇంటిని ప్రభాస్ డిజైన్ చేయించుకున్నాడు. అత్యుత్తమ సౌకర్యాలతో పాటుగా లోపల ఓ తోట కూడా ఉంది. పచ్చదనాన్ని ఎక్కువగా ఇష్టపడే ప్రభాస్.. వివిధ రకాల మొక్కలను కూడా పెంచుతున్నాడు. అత్యంత ఖరీదైన టైల్స్, లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే సెక్యూరిటీ అన్నీ ఓ సంచలనమే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్