Wednesday, August 5, 2026 05:15 PM
Wednesday, August 5, 2026 05:15 PM

భూమనను అడిగిన ప్రశ్నలు ఇవే..?

గత కొన్నాళ్ళుగా పరకామణి చోరీ వ్యవహారం సంచలనం అవుతోన్న సంగతి తెలిసిందే. పరకామణి వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనే వార్తల నేపధ్యంలో.. ఈ వ్యవహారాన్ని హైకోర్ట్ కూడా సీరియస్ గా తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు విచారించారు. ఈ అంశంలో ఆయనే కీలక వ్యక్తి అనే ఆరోపణల నేపధ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వగా నిన్న భూమన హాజరు అయ్యారు.

Also Read : ఆ జిల్లా సంగతి నేను చూస్తా.. చంద్రబాబు కీలక కామెంట్స్

ఈ సందర్భంగా డీజీ రవి శంకర్ అయ్యన్నార్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న సతీష్ కుమార్ మరణంపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు రవిశంకర్ అయ్యన్నార్. సతీష్‌ కుమార్‌ ది ఆత్మహత్యేనని మీడియాకు ఎలా చెప్పారు? అని నిలదీశారు. ఆత్మహత్య అనడానికి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి? అని ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్‌ ఆస్తులను శ్రీవారికి గిఫ్ట్ డీడ్‌ గా ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read : బ్రేకింగ్: గోదావరి పుష్కరాల తేదీలు ఇవే.. చంద్రబాబు ఖాతాలో హ్యాట్రిక్ రికార్డ్..!

అప్పటికప్పుడు టేబుల్‌ ఎజెండాగా పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఎవరి ప్రమేయం ఉంది? అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేసులు రాజీ చేయాలని ఎవరి నుంచైనా ఒత్తిళ్లు వచ్చాయా?.. రాజీ అంశంలో పోలీసులకు మీరేమైనా సూచించారా? అని నిలదీసినట్లు సమాచారం. రవికుమార్‌ ఆస్తులను ఎవరైనా రాయించుకున్నట్లు అనుమానం ఉందా? రవికుమార్‌పై విజిలెన్స్‌ ద్వారా ఎలాంటి దర్యాప్తు చేయించారు అని ప్రశ్నించగా.. దీనిపై భూమన సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. ఇక బయటకు వచ్చి వెటకారంగా భూమన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒత్తిడి భరించలేని నిబద్దత కలిగిన పోలీసు అధికారులు నన్ను పిలిచారు అంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

పోల్స్