ఈ నెలలో దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడులకు సంబంధించి దర్యాప్తు అధికారులు వేగం పెంచారు. ఈ దాడుల్లో కీలక ఆధారాలను సేకరించే పనిలో పడిన అధికారులు.. ఉగ్రవాద మూలాలు ఉన్న వ్యక్తులను క్రమంగా విచారిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరో సంచలన అంశం బయటపెట్టారు. ఢిల్లీ ఆత్మాహుతి కార్ బాంబు దాడిలో పాల్గొన్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ను చేధించారు.
Also Read : రాహుల్ ముందు రేవంత్ ఆధారాలు.. కీలక నేతకు వీడ్కోలు ఖాయమా..?
నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడికి ముందు డ్రోన్‌లను ఆయుధాలుగా మార్చడానికి, రాకెట్ ల ద్వారా ఉగ్రవాద దాడులకు ప్రణాళిక రచించారు అని గుర్తించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడుల మాదిరిగా ఉండే విధంగా ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. ఆ దాడుల్లో డ్రోన్ లను హమాస్ ఆయుధాలుగా వాడుకున్న సంగతి తెలిసిందే. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ ఉన్ నబీతో కలిసి పనిచేసిన రెండవ ఉగ్రవాద అనుమానితుడిని అరెస్టు చేసిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఈ విషయం గుర్తించింది.
Also Read : సజ్జన్నార్ పై పవన్ ఆసక్తికర కామెంట్స్..!
వైట్ కాలర్ మాడ్యూల్, ఆత్మాహుతి బాంబర్ నబీ చేసిన దాడి వెనుక అనంత్ నాగ్ జిల్లాకు చెందిన ఉగ్రవాద అనుమానితుడు ఇందులో కీలకంగా వ్యవహరించాడు అని.. ఈ అంశాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కెమెరాలతో పాటు బరువైన బాంబులను మోసుకెళ్లగల పెద్ద బ్యాటరీలతో అమర్చిన డ్రోన్‌లను తయారు చేయడానికి పోలీసుల అదుపులో ఉన్న డానిష్ ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అతనికి చిన్న ఆయుధాలతో కూడిన డ్రోన్ లను తయారు చేయడంలో అనుభవం ఉన్నట్టు వెల్లడించారు.

