Saturday, September 19, 2026 10:24 AM
Saturday, September 19, 2026 10:24 AM

రాహుల్ ముందు రేవంత్ ఆధారాలు.. కీలక నేతకు వీడ్కోలు ఖాయమా..?

తెలంగాణా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం ఎన్నో చర్చలకు వేదికగా మారుతోంది. రాజకీయంగా ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్నిక కావడంతో.. సిఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అందరూ.. పెద్ద ఎత్తున కష్టపడిన పరిస్థితి ఉంది. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. ఇక్కడి నుంచి సిఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ మరింత పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. దీనితో సిఎం ఇక నుంచి సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేయవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Also Read : మరో ఘోరం.. ఈసారి మక్కాలో.. అచ్చు కర్నూలు ప్రమాదం మాదిరిగానే…!

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తనను ఇబ్బంది పెట్టేందుకు ఓ వర్గం సిద్దమై.. పరోక్షంగా భారత రాష్ట్ర సమితి కోసం పని చేసిందనే సమాచారం తెప్పించుకున్న రేవంత్ రెడ్డి.. ఎన్నికల ఫలితాల తర్వాత.. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్ళిన సమయంలో.. ఆయన వద్ద ఆ లిస్టు, వ్యతిరేక కార్యక్రమాలను ఆధారాలతో సహా సమర్పించినట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కొందరు మంత్రులను తాను పక్కన పెట్టేందుకు సిద్దమయ్యానని, కారణాలు ఇవేనని రేవంత్ చెప్పినట్టు సమాచారం.

Also Read : బ్రేకింగ్: ఇమ్మడి రవికి మరో పేరు.. సజ్జన్నార్ సంచలన విషయాలు..!

దీనికి రాహుల్ గాంధీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఓ ప్రముఖ నేత కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ కు మంత్రి పదవి విషయంలో కూడా ఇతర మైనార్టీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఎలాగూ.. మంత్రి వర్గ విస్తరణతో పాటు మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చిన అధిష్టానం.. ఈ అంశానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ మార్పులు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

పోల్స్