Sunday, September 20, 2026 04:59 AM
Sunday, September 20, 2026 04:59 AM

బ్రేకింగ్: మాజీ ప్రధానికి ఉరి శిక్ష..!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు ఉరి శిక్ష విధించింది. కాసేపటి క్రితం సుదీర్ఘ తీర్పును కోర్ట్ వెల్లడించింది. గత ఏడాది ఆ దేశంలో విద్యార్థుల నేతృత్వంలోని ఆందోళన సందర్భంగా జరిగిన మానవత్వాన్ని మరిచి ఆమె నేరాలకు పాల్పడ్డారనే కారణంతో కోర్ట్ ఉరి శిక్ష విధించింది. ఈ పరిణామాలు ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసాయి. ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఈ తీర్పు వెల్లడించింది.

Also Read : లిక్కర్ డాన్ అనీల్ చోక్రా.. ఏపీ లిక్కర్ స్కామ్ లో అతనే మాస్టర్ మైండ్..?

తీర్పుకు ముందు దేశంలో హింస చెలరేగే పరిస్థితి కనపడింది. దీనితో ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతను పెంచింది. ఢాకాలో 15 ఏళ్ల హసీనా పాలన ముగిసినప్పటి నుండి బంగ్లాదేశ్ రాజకీయ గందరగోళంలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి ప్రకారం, హసీనా అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో.. పెద్ద ఎత్తున అణిచివేతకు పాల్పడ్డారు. దీనితో 1,400 మంది వరకు మరణించారు. అందులో యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు.

Also Read : మరో ఘోరం.. ఈసారి మక్కాలో.. అచ్చు కర్నూలు ప్రమాదం మాదిరిగానే…!

నేడు ఆమె విచారణకు హాజరు కాకుండానే కోర్ట్ తీర్పు వెల్లడించింది. హసీనా నేరం చేసిందని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి పేర్కొన్నారు. హసీనా మానవత్వాన్ని మరిచింది.. ఆమె చేతులు రక్తంతో తడిచాయని, ఆందోళనకారుల్ని చంపమని హసీనా ఆదేశాలు జారీ చేశారని ఢాకా ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. విచారణకు హాజరు కావడానికి భారతదేశం నుండి తిరిగి రావాలన్న కోర్టు ఆదేశాలను 78 ఏళ్ల షేక్ హసీనా ధిక్కరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్