Saturday, September 19, 2026 09:28 AM
Saturday, September 19, 2026 09:28 AM

సజ్జన్నార్ పై పవన్ ఆసక్తికర కామెంట్స్..!

సినిమా పైరసీలకు సంబంధించి ఏళ్ళ తరబడి సినిమా పరిశ్రమ, పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ విషయంలో కీలకంగా వ్యవహరించే.. ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనిపై సినీ పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాసేపటి క్రితం సీపీ సజ్జన్నార్ మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఆ సమావేశంలో.. చిరంజీవి, రాజమౌళి సహా సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read : నాకే ఫోన్ చేయండి.. మాలేపాటి కుటుంబానికి లోకేష్ ఇచ్చిన హామీ ఏంటీ..? 

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు తలచుకుంటే నేరగాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటారని నిరూపించారన్నారు. పైరసీపై మూడు నెలల క్రితం మేం ఫిర్యాదు చేశామని, ఉచితంగా వస్తోందని పైరసీ సైట్లలో సినిమాలు చూస్తున్నారు.. డేటా అంతా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోందని గ్రహించాలని కామెంట్ చేసారు. పైరసీని ప్రోత్సహిస్తే మీ కుటుంబాలు చాలా నష్టపోతాయని వ్యాఖ్యానించారు. ఇక దీనిపై ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కూడా హర్షం వ్యక్తం చేసారు.

Also Read : రాహుల్ ముందు రేవంత్ ఆధారాలు.. కీలక నేతకు వీడ్కోలు ఖాయమా..?

హైదరాబాద్‌ పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు అభినందనలు తెలిపారు. సినిమా విడుదల రోజునే నెట్‌లో పెట్టడం వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందన్నారు. పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదని, పోలీసులకు సవాల్‌ విసిరే స్థాయికి వచ్చిన పైరసీ ముఠాను అరెస్టు చేయటం సంతోషమన్నారు. సజ్జనార్‌ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చిందన్నారు. సజ్జనార్‌ చర్యలు తెలుగు సినిమాకే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

పోల్స్