Thursday, August 6, 2026 11:01 AM
Thursday, August 6, 2026 11:01 AM

నువ్వు స్టేట్ కాదు.. నేషనల్.. ఢిల్లీ వచ్చేయ్..!

కాంగ్రెస్ పార్టీ విషయంలో జరిగే పరిణామాలు ఈ మధ్య ఆసక్తిని రేపుతున్నాయి. జాతీయ స్థాయిలో బలోపేతం అయ్యేందుకు తీవ్రంగా కష్టపడుతూ వస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం.. ఇటీవల బీహార్ లో కూడా ఓటమి పాలు కావడంతో సీనియర్ నాయకులను పక్కన పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వృద్ద నాయకత్వంతో ఇబ్బంది పడుతోన్న కాంగ్రెస్.. సీనియర్ నేతలను సలహాల కోసమే వాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పదవీ కాలం ముగిసింది.

Also Read : మరో ఘోరం.. ఈసారి మక్కాలో.. అచ్చు కర్నూలు ప్రమాదం మాదిరిగానే…!

కాబట్టి జాతీయ అధ్యక్షుడి వేటలో పడింది అధిష్టానం. దీనితో కర్ణాటకకు చెందిన ఇద్దరు నేతల పేర్లను జాతీయ అధ్యక్ష పదవి విషయంలో పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో కేసి వేణుగోపాల్, డీకే శివ కుమార్ పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉండటంతో అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : బ్రేకింగ్: ఇమ్మడి రవికి మరో పేరు.. సజ్జన్నార్ సంచలన విషయాలు..!

ఇతర నేతలు కూడా ఆయన ఎంపిక విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. డీకే శివకుమార్ కు మాస్ ఇమేజ్ తో పాటుగా ఆర్ధికంగా బలమైన నేతగా కూడా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. దీనితో అధిష్టానం ఆయనను రాష్ట్రానికి పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా సీనియర్ నాయకులను పక్కన పెట్టె ఆలోచన చేస్తోంది అధిష్టానం. ముందు అధ్యక్షుడి ఎంపిక పూర్తైన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. కేసి వేణుగోపాల్ కూడా డీకే నాయకత్వాన్ని అంగీకరించినట్టు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్