వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదో తెలుసా అని ప్రశ్నించారు కూడా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చట్టసభలంటే ఏ మాత్రం గౌరవం లేదన్నఅయ్యన్న.. ప్రజా ప్రతినిధిగా ఎలాంటి అర్హత లేదన్నారు.
Also Read : నెయ్యి కల్తీగాళ్ళను వెనకేసుకొస్తున్న వైసీపీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అయ్యన్న పాత్రుడు తొలి నుంచి గుర్రుగానే ఉన్నారు. తాజాగా అనపర్తిలో పర్యటించిన అయ్యన్న.. వైసీపీ నేతల తీరుపై విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. అక్రమ సంపాదనతో మరోసారి తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు భ్రమలో ఉన్నారని.. కానీ ఓటర్లు ఎన్నికల్లో సరైన రీతిలోనే బుద్ధి చెప్పారన్నారు. వై నాట్ 175 అని చెప్పిన జగన్‌కు ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారని.. 11 సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని అయ్యన్న ప్రశ్నించారు.
ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను అయ్యన్న తిప్పి కొట్టారు. ప్రభుత్వం తప్పు చేస్తే.. దానిపై అసెంబ్లీలో నిలదీయాలని సూచించారు. అసెంబ్లీ బయట ఎన్ని ఆరోపణలు చేసినా.. వాటికి ఎలాంటి ప్రామాణికం లేదన్నారు. అసలు జగన్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదో తెలుసా.. అని ఎదురు ప్రశ్నించారు అయ్యన్న. అసెంబ్లీలో జగన్‌కు ఓ ఎమ్మెల్యే మాత్రమే అని అయ్యన్న వ్యాఖ్యానించారు. ఓ ఎమ్మెల్యేకు ఇచ్చే సమయమే జగన్‌కు కూడా ఇస్తామన్నారు. అంతే తప్ప.. సీఎంకు ఇచ్చినంత సమయం ఎలా ఇస్తామన్నారు. అదే సమయంలో.. అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : తిరుమల లడ్డూ ప్రసాదం.. పవన్ ఘాటు వ్యాఖ్యలు..!
సభకు వస్తే.. మాట్లాడే సమయంలో స్పీకర్‌ను అధ్యక్ష అని సంబోంధిచాలని.. స్పీకర్ స్థానంలో ఉన్న తనని కానీ, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కానీ.. అధ్యక్ష అనటం జగన్‌కు ఇష్టం లేదన్నారు. గతంలో తనపైన, ఆర్ఆర్ఆర్ పైన కేసులు పెట్టి వేధించిన జగన్.. ఇప్పుడు అధ్యక్ష అని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వచ్చి తన ముందు అధ్యక్షా అని సంబోధిస్తూ మాట్లాడటం ఇష్టం లేకే సభకు రావడం లేదని స్పీకర్ తేల్చేశారు.

